కావ్యాంజలి
ప్రతీకాత్మక చిత్రం |
కనుచూపులకే అందని రూపమా కలవై నా కన్నుల్లో నిలువుమా
కాంతివై సంక్రాంతి వై నీలాల కన్నుల్లో దాగిన నిండు కాంతికి రూపమై
వెన్నెల కాచిన అడివికి ఋతురాగానివై కల్మషం లేని మనసు కె ప్రతిబింబం నీవై
కాలం తో పాటు కాలాతీతమై కన్నుల్లో మెదిలే స్వప్నరాగమై భావ గీతమై
సాగర ఘోషల లయలో తరంగాల నీడలో కడలి అలల్లో నిక్షిప్తమై
మేలిమి ముత్యాల కాంతి పంచుతూ ఇలా సాగిపో కావ్యాంజలి వై నిత్య నూతన వాహిని వై