జీవితానికి విలువ
Indicative Image Only |
వెలుగు లేనిదే నీడ ఉండదు వెలుగు తోనే నీడ విలువ
ఎండ లేనిదే చినుకుండదు ఎండా తోనే వర్షానికి విలువ
బాధ లేనిదే సంతోషం ఉండదు బాధ తోనే సంతోషానికి విలువ
స్నేహం లేనిదే బంధం ఉండదు స్నేహం తోనే బంధానికి విలువ
జీవితంలో ఒడిదుడుకులు ఎప్పుడు ఉండేవే అని తెలిసిన నాడు
జీవితం అంటే అన్ని భావాల సమ్మేళనం అని తెలిసిన నాడు
ఉవ్వెత్తున ఎగిసే అలలా నిలువెత్తున వెలిగే దీపంలా జ్ఞాన జ్యోతి లా ప్రజ్వలిస్తుంది
మరొకరికి సాయపడుతూ సాగిపో ఇలా వెలుగు పంచితే దారి అదే కనిపిస్తుంది
తిమిరంధకారం కన్నా తేటతెల్లని వెలుగు ఎలా అయితే మనసుకు సాంత్వన కలిగిస్తుందో
నిరాశ నిస్పృహల నిట్టుర్పుల జీవితానికి ఇదే సరి అయిన విరుగుడని తెలుసుకో
ఈ జీవిత పయనం లో వడివడిగా అడుగులేస్తూ నవ్వుతు నవ్విస్తూ సాగు
లోకం నిన్ను చూసి గర్వ పడి కోరుకోవాలి అందరితో పాటు నీయొక్క బాగు