జీవితం ఓ అలుపెరుగని వయనం

Image Courtesy: Deviant Art
జీవితం ఓ అలుపెరుగని వయనం
నవ్వులు ఇందులోనే బాధలు ఇందులోనే
పయనం మాత్రం ఆపకు ఓ బాటసారి
గమ్యం ముఖ్యం కాదు గమనమే ముఖ్యం


నువ్వు నడక నేర్చుకున్నది ఈ జీవితం తోనే
ప్రేమను మమతను చవి చూసింది ఈ దేహం తోనే
ప్రకృతి నీకు తోడై నీడై నీ వెంట రాగా
ఆశిస్సులే నీకు ఆలంబనై నిలువగా
సాగర కెరటం లో ఏమున్నది ఓ నీటీ బొట్ల సమూహమే
ఉదయకాంతిలో ఏమున్నది సూర్యుని కోట్ల కాంతి పుంజలే
మబ్బుల్లో ఏమున్నది దుమ్ము ధూళి తాలుకు ఆనవాలే
అవే అంతటి శక్తిని పంచుతున్నాయంటే మనం కూడ కలసికట్టుగా ఒక జట్టుగా ఉంటే కలిమి బలిమి
లేకుంటే ప్రపంచమే భగ్గున మండే నిప్పుల కొలిమి
Image Courtesy: Deviant Art

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల