ప్రకృతి గీతం

తిమిరంధకారం  ఎలా అయితే సూర్యుని వలన సమసిపోతుందో
అలానే కొన్ని బంధాల వల్ల ఆ జీవితానికే సార్థకత లభిస్తుంది

కొలనులో ఉన్న కాలువకు గెడ్డ పైన ఉన్న చెట్టు చేమ కు తేడ ఒకటే
అంత నీరున్నా కలువ ఒక్క పువ్వే పూస్తుంది రోజుకు ఆ చెట్టు కు వందల పూలు

ఆ ఒక్క తామర పువ్వు ఈ వందల పూల కంటే దేదీప్యమానంగా విరబుస్తుంది
కొన్ని పరిచయాలు అంతే జీవితాలనే మార్చేస్తుంది

రెక్కలు తొడిగే పక్షి ఎంత దూరం ఎగిరిన తన గూటికి చెరక మానదు
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగిన తన ఉనికిని తన లోకాన్ని మరిచిపోకూడదు

గడ్డిపువ్వుకు కూడా ఈ పుడమే తల్లి మఱ్ఱి మాను కు కూడా ఈ నేలె అమ్మ వొడి
దేవుడేక్కడున్నాడని ప్రశ్నించకు నీ ప్రతి అడుగు జాడల్లో నీ ప్రతి పలుకులో ఆంతరికంగా నీలోనే ఉన్నాడు
ప్రకృతి ఒడిలో నీతో మమేకమై ఉండే పంచభూతాల్లో ఇమిడి  ఉన్నాడు నిత్యం నీతో సాగుతూ


Indicative Image Courtesy: Deviant Art

Popular Posts