ఆలోచనలు
కన్నులకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి లోకాన్ని లోకం లో రంగులన్నిటిని తన కంటిపాపలో నిగుడితం చేసుకుంటుంది కదా ! చేతులకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి మనసు పలికే భావాలన్నిటిని అలవోకగా వర్ణాల్లోకి మార్చేస్తుంది కదా ! పాదాలకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి కనులకే కనపడని దూర తీరాలకు మన గమ్యాలకు చేరవేస్తుంది కదా ! మనసుకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి ఎదురుగ నిలిచినా మనసు భాషను చెప్పకున్న అర్ధం చేసుకుంటుంది కదా !