Posts

వేదనకు సాక్ష్యం

Image
మాటే మౌనమై మదిలో ఇలా దాగేనా  ఋతువులు మారినా పుడమిని తడిమేనా  కాలగమనమె దరి చేర్చుతుంది ఎవరినైనా  ఒర్పులో మార్పు రానీకు ఏ రోజైనా కన్నులు పలికే భాషలు మూడు  ఆనందం నిండిన కనులను చూడు  బాధలో ఉన్న కన్నిరుని చూడు  లోకాన్నే తనలో బంధించే చిన్ని గవాక్షాన్ని పరికించి చూడు    వేవేల భావాలతో లయబద్దంగా కొట్టుమిట్టాడుతున్న గుండె సవ్వడి  కాలానికే అందక పరుగులు తీసేనా ఏమో ఎప్పుడైనా పొరబడి  కల్మషం ఎరుగని భావన ఏదైనా ఉంటె దాచుకో మదిలో త్వరపడి  ఒర్పులో చేర్పులో పలుకులో రానీయకు ఏనాడు బాధను వెంటపడి  కలలరూపం కావ్యాలలో ఇమిడే అక్షరాలగా  ప్రతి అక్షరం ఓ భావనకు ప్రతీకగా  మాట మునమైనా మదిలో భావానికి ప్రతిరూపంగా  వెలిసే నేడు ఇలా  మౌనం నవ్వులు వేదనకు సాక్ష్యం గా  

బంధమంటే

Image
మిన్నుకి పుడమికి గల బంధమేమి ? చెలిమి బంధమే కాదా  కనుకే  చీకటి వెలుగులు పుడమికి అందిస్తుంది ! సంద్రానికి చంద్రానికి గల బంధమేమి ? చెలిమి బంధమే కాదా  కనుకే  చంద్రుని గమనాన్ని బట్టి అల కదులుతుంది  సూర్యునికి చంద్రునికి గల బంధమేమి ? చెలిమి బంధమే కాదా  కనుకే  చీకటి లో చిన్నబోయిన చంద్రుని తన వెలుగులు పంచి వెన్నెల కురిపిస్తుంది  వసంతానికి కోయిలకు గల బంధమేమి? చెలిమి బంధమే కాదా  కనుకే  వసంతాల వేల కోయిల కుహుకుహురాగాలు మిళితం చేస్తుంది  మనిషికి మనిషికి గల బంధమేమి  చెలిమి బంధమే కాదా  కనుకే ఆప్యాయతతో పలకరిస్తే ఆ బంధమే ఋణానుబంధం అయ్యి నిలుస్తుంది 

ఆలోచనలు

Image
కన్నులకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి లోకాన్ని లోకం లో రంగులన్నిటిని తన కంటిపాపలో నిగుడితం  చేసుకుంటుంది కదా ! చేతులకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి మనసు పలికే భావాలన్నిటిని అలవోకగా వర్ణాల్లోకి మార్చేస్తుంది కదా ! పాదాలకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి కనులకే కనపడని దూర తీరాలకు మన గమ్యాలకు చేరవేస్తుంది కదా ! మనసుకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి ఎదురుగ నిలిచినా మనసు భాషను చెప్పకున్న అర్ధం చేసుకుంటుంది కదా ! 

ప్రకృతి గీతం

Image
తిమిరంధకారం  ఎలా అయితే సూర్యుని వలన సమసిపోతుందో అలానే కొన్ని బంధాల వల్ల ఆ జీవితానికే సార్థకత లభిస్తుంది కొలనులో ఉన్న కాలువకు గెడ్డ పైన ఉన్న చెట్టు చేమ కు తేడ ఒకటే అంత నీరున్నా కలువ ఒక్క పువ్వే పూస్తుంది రోజుకు ఆ చెట్టు కు వందల పూలు ఆ ఒక్క తామర పువ్వు ఈ వందల పూల కంటే దేదీప్యమానంగా విరబుస్తుంది కొన్ని పరిచయాలు అంతే జీవితాలనే మార్చేస్తుంది రెక్కలు తొడిగే పక్షి ఎంత దూరం ఎగిరిన తన గూటికి చెరక మానదు మనిషి ఎంత ఎత్తుకు ఎదిగిన తన ఉనికిని తన లోకాన్ని మరిచిపోకూడదు గడ్డిపువ్వుకు కూడా ఈ పుడమే తల్లి మఱ్ఱి మాను కు కూడా ఈ నేలె అమ్మ వొడి దేవుడేక్కడున్నాడని ప్రశ్నించకు నీ ప్రతి అడుగు జాడల్లో నీ ప్రతి పలుకులో ఆంతరికంగా నీలోనే ఉన్నాడు ప్రకృతి ఒడిలో నీతో మమేకమై ఉండే పంచభూతాల్లో ఇమిడి  ఉన్నాడు నిత్యం నీతో సాగుతూ Indicative Image Courtesy: Deviant Art

ప్రాగ్దిశ కాంతి

Image
336/500 చిత్రం ఏమిటంటే యవ్వనం లో ఉన్నప్పుడు జీవితం విలువ తెలియదంటారు లోకులు కాని ఆ యవ్వనం ఇచ్చే అనుభవాల సారాన్ని మూటగట్టుకుని జీవిత సాగరం ఈదుతాము  అలా ఈదుతూ ఈదుతూ సహనం కొలిపోయి మనసు అలసిపోయి వృద్ధాప్యం లో  అనుభవాలు మెండుగా ఉన్నపటికీ ఆ సేకరించిన అనుభవం తో ఏమి చెయ్యలేరు  చెయ్యాలన్న మనసు ఎగిరి గంతెసినంతగ ముదసలి ప్రాణంకు వీలు పడదు  జీవితం అంటే అనుభవాలే కాదు అది అన్ని రాగద్వేషాల సమ్మేళనం  ఓర్పును మనకు సహననాన్ని మనకు సహవాసం గా ఇచ్చే అరుదైన పెన్నిధి  ఆడుతూ పాడుతూ తన ఉనికిని తన కర్తవ్యాన్ని ఎప్పుడు పాలిస్తూ చల్లగా ఉండాలందరూ  సూర్యుడి తొలిపొద్దు లేదు మలిసంధ్య లేదు అదంతా మనకోసమే కొత్త ఉత్తేజం కోసం  నూతన ఒరవడి కోసం నిత్యనూతన స్నేహాలా పెన్నిధి కోసం నడిచి వచ్చే బంధాల కోసం  కన్నులు తెరిచే తోలి రేయి చీకటి ని చేరి మరల నవ్యోదయాలు ఉదయించినట్టు  {నోట్: This Poem Marks My 500th Post on Kaavyaanjali and My 336th Post in Poetry Category}

కావ్యాంజలి

Image
ప్రతీకాత్మక చిత్రం  కనుచూపులకే అందని రూపమా కలవై నా కన్నుల్లో నిలువుమా  కాంతివై సంక్రాంతి వై నీలాల  కన్నుల్లో దాగిన నిండు కాంతికి రూపమై  వెన్నెల కాచిన అడివికి ఋతురాగానివై  కల్మషం లేని మనసు కె ప్రతిబింబం నీవై  కాలం తో పాటు కాలాతీతమై కన్నుల్లో మెదిలే స్వప్నరాగమై భావ గీతమై  సాగర ఘోషల లయలో తరంగాల నీడలో కడలి అలల్లో నిక్షిప్తమై  మేలిమి ముత్యాల కాంతి పంచుతూ ఇలా సాగిపో కావ్యాంజలి వై నిత్య నూతన వాహిని వై 

కన్నీరు-పన్నీరు

Image
Indicative Image Only ఆర్ద్రత నిండిన కన్నుల్లో చెప్పలేని భావాలు ఎన్నో ఎన్నెన్నో గుండె బరువెక్కినా మనసుకు హాయి కలిగినా పలకరించే నేస్తాలు యదలో బాధ ఉప్పోంగిన చిద్విలాసముగా మనసు మురిసినా ఆకాశాన చినుకుల్లా కంటి భాషకు సరితూ గే అక్షాశృవులు మనసుకు బాధకలిగినా గుండెలయ తప్పిన రాలే భావానికి ఆనవాలు ఈ చమర్చే కనులు. సంతోషమైనా దుఃఖమైన జాలువారే నయనభాష్పాలు ఉద్వేగ సంకేతాలు చెమ్మగిల్లిన కనులను తుడిచి సాంత్వన చేకూర్చే చేతులు ఉన్నంతవరకు ఆ కన్నిళ్ళు మనసు బాధను మనసు భాషను అర్థం చేసుకునే ఆర్ద్రత నిండిన హృదయంతరాలు చెమర్చిన కన్నుల వెనక దాగిన భావం లోకం లో అన్ని చెడులను జయిస్తుంది కన్నులు పలికే భావన ను యదకు హత్తుకుని సాంత్వనలతో ఓలలాడిస్తుంది ఎవరిని ఉద్దెశించి రాసినది కాదని మనవి. శ్రీధర్ భూక్య