Skip to main content

Posts

He vs She

 2024 June He: I must open up and respond, only if she is of my type She: I hope he interacts with me with the same rapport. 2025 December  He: I must interact with her more, such that the bonding gets strong She: I must respond to him, as less as possible.

మహా గణపతి

 రోజువారి దైనందిన జీవితాన పుజలు పురస్కారలు కాస్త ఆటవిడుపు ఉరుకులు పరుగులు నిండిన జీవితాన ఉత్సవాల మేలుకొలుపు ఆత్మీయ పలకరింపు నిత్యం దీప ధూప నైవేద్యాదులతో ఎవరికి వారే పూజిస్తున్న వేళ సకుటుంబ సమేతమై జనవాహినిలో మూడేళ్ల కిందట మొదలాయే గణపతి హేల ప్రతి యేట నూతనోత్సాహం మనందరికి ఆశిస్సులే ప్రోత్సాహం దేవాగ్రగణ్య పూజిత అంబాసుత జై మరల వేచి చూసేము నీ ఉత్సవానికై ~శ్రీధర్ భూక్య

బోలార

 'హాయి.. మీరు బాగున్నారా.. ఎక్కడి నుండి మీరు' తో మొదలయ్యింది మన తొలి పరిచయం 'మీరు ఏంటి, అండి ఎందుకు.. నువ్వు అను' అనే మాటలతో చాలా దూరం వచ్చేశాం ఆ దూరం తగ్గించి ఇకనైనా మనం ఇరువురు దగ్గరగా రాలేమా 'మనసేమి బాగోలేదు.. నీ మాటలు వింటే ఏదో తెలియని హాయి' తో మొదలయ్యింది నీ స్వర మాధుర్యం మాట మాట పెరిగి మన పరిచయం చిక్కబడి ఆ దారికే నీ పేరు పెట్టుకునేంత దూరం వచ్చేశాం ఆ దూరం తగ్గించి ఇకనైనా మనం ఇరువురు దగ్గరగా రాలేమా 'నీకు నాకు నడుమన సగటున నూట నలభై మూడు కిలోమీటర్లే తేడ' 'రక్తం కూడా నా రకమే, నీకు నాకు తొమ్మిది నెలలే తేడ' ముక్కలైన గుండె నాదీ నీదీ కూడా అని ఒకరినొకరు చూస్తు చాలా దూరం వచ్చేశాం ఆ దూరం తగ్గించి ఇకనైనా మనం ఇరువురు దగ్గరగా రాలేమా నా ఆత్మీయ బాంధవి 'బోలార' కు అంకితం

పచ్చడి మెతుకులు మజ్జిగ చుక్కలు

 ఏమైయ్య దివాకరం నే విన్నది నిజమేనటోయి.. వంకర్లు బోతు అడిగాడు పరమేషం నువ్ విన్నది ఏమిటో నాకు తెలియదు కదా.. తెలియకుండానే నిజమా కాదా నేనెలా చెప్పేది.. నీరుగార్చాడు దివాకరం అదే.. నువ్ విన్నదే.. ఏమో నాకేమాత్రం వినబడలేదు..  ఇలా ఎవరికి వారే సముదాయించగా.. అటుగా వెళ్తున్న సోడ సాంబడు భార్య జాజుల చిన్ని మూతిని తొమిది తీర్ల తిప్పి చల్ల ముంత దెచ్చి అరుగుపై పెట్టి కవ్వం ను కడుగుతోంది.. నువ్ ఎన్ని ముంతల చల్ల చిలికినా లాభం లేదు.. ఈ పొద్దు గోలి సోడాలే అమ్ముడు పోతాయి అంటు కనుబోమ్మలు ఎగిరేసి సోడ బుడ్డిను నొక్కాడు. అదెం విడ్డురమో ఆ శబ్దం విని పక్కనే విందు భోజనాలంటు బయిట బోర్డ్ పెట్టి లోపల మాత్రం మాగాయ తొక్కు, ఆవ పిండి నూరి వరంగల్ కారం దట్టించి ఊరబెట్టిన ఆవకాయ చిట్టి ముత్యాల బీయం తో కలిపి తింటు హాహా అంటు అరుస్తు గోలి సోడాలందుకున్నారు.. ఇక గుటకేశారో లేదో మంట తంట జంటగా వంటను పంటకు తెచ్చింది కాకపోతే ఘాటు పోలేదు.. వరంగల్ మిర్చి కారమా మజాకా.. ఇలా కాదని ఇటో పాలి వచ్చి ముంత మజ్జిక పుచ్చుకోండంటు డీజేల దాక పోలేక రికార్డ్ మైక్ తోనే సరిపెట్టుకుంటు జాజుల చిన్ని నాజుకుగా నవ్వింది. ఇహ మొదలు ఐదు రూపాయల ముంత మజ్జ...

నికార్సయిన నిజాలు

 మాట అనటం చాలా తేలిక..  కాని మాట విని ఓర్చోగలగటం అంత సులువు కాదు ఎవరి స్థితిగతులను ఎవరూ నియంత్రించలేరు కాలమే సరైనా సమాధానమౌ గాక.. : మనం మంచికి యత్నించి ముళ్ళును దారి నుండి తొలగిస్తే అదే ముళ్ళు మన కాలికే గుచ్చుకునట్టు నేను మంచి చేయాలని చూసినా అది చెడుగా మారి నన్నే చుట్టుకునట్టు : ఎంతో లేదు నీ జీవితం నువ్వు ఊపిరి బిగపట్టి విడిచే నిడివే ఆ ఊపిరే తట్టుకుంటే అదే నీ చివరి మజిలి : అందరి మంచి కోరే వారికి చివరిన కొరివే మిగిలినట్టు విశ్వాసం లేని చోట కుక్క కూడా నక్కలా మారినట్టు : ఆశలు పేక మేడలే  ఆశయాలు మూల స్తంభాలు జీవితం క్షణకాలమే కీర్తి ప్రతిష్టలు మాత్రమే తాయిలాలు : నీ గాయానికి లేపనం లేనపుడు కాలానికే వదిలేయి గాటుగా మిగిలి ఉంటుంది కాదని గెలికితే గాయమే పెను ప్రమాదమై అసలుకే ఏసరై నీరుగారిపోతుంది : కాలానికి మించి మిక్కిలిదంటు ఏమి లేదు రాజు లేడు రాణి లేదు బంటు లేడు : కన్నులు లోకాన్ని అవలీలగా చూస్తాయి కాని సంద్రాన్ని లోలోపలే అలవోకగా దాచుకుంటాయి : బంధం కాని నేను నీకు అవసరమై మిగిలిపోయాను అద్దం లాంటి మనసులో నీ ప్రతిబింబాన్ని దాచుకున్నాను ముక్కలై పోయింది దర్పణం కాని ప్రతి ముక్కలో నీ రూపమై వెల...

అలక.. కోపం.. మౌనం

 అలిగావా.. ఐతే విను తీరిక వేళలో అలగ వచ్చు ఒక్క సారి ఈ క్షణం దాటితే మరల రాదు కోపగించుకున్నావా.. ఐతే విను తప్పు నాదైనా నీదైనా అవ్వ వచ్చు మానవులం మనలో మనకే విసుగు కాలం ఎంతో లేదు తలుచుకున్నా జ్ఞాపకమే ఒక్కసారి ఈ క్షణం దాటినా బంధం తిరిగి రాదు మాటరాక మౌనముద్ర దాల్చావా.. ఐతే విను మాటలకి ఆనకట్ట వేసినంత మాత్రానా  మనసులో ఉన్న భావన ఎపుడు చెదిరిపోదు ఈ క్షణం నీకు కలిగిన వేదన కూడా సమసిపోతే మాటలు వాటికవే మెదులుతాయి రేపు నువు చెప్పాలనుకున్నా నీ మనసు పలికే భావాలను ఏకరూపు దాల్చలేక నీలోనే కుమిలిపోయేకంటే ఒక్కసారి మౌనముద్ర వీడి మనసు విప్పి మాటాడు

TTD Trip 2025

 07 April 2025 19:15 12764 Padmavati Express  421 4272542 3A Kazipet Jn. to Tirupati 08 April 2025 07:15 Oletra Electric Bus Tirupati to Tirumala 08:40 Alighted at Central Reception Office 09:15 Breakfast: Vada 11:30 QR Code Scanned 12:10 Lunch: Pumpkin Khichdi Matrushri Vakulamata Rest House Room No. 350 Check-in at 12:29 14:45 Tonsuring of Head at Nandakam Guest House 16:40 Snacks: Samosa, Pakodi, Jalebi, Masala Peanuts 18:20 Dinner at Matrushri Tarigonda Vengamamba Anna Daana Centre (Ivy Gourd Curry, Sambar Rice) 18:50 Free Bus to ATC Circle 19:00 In Queue towards Darshanam 21:00 In-Scan 23:45 Darshan of Lord Venkateshwara Swamy 09 April 2025 00:45 Darshanam Complete 01:15 To Laddoo Prasadam Counter  01:45 Bought 4 Laddoos (Prepaid) + 4 Laddoos (Postpaid) 09:00 Breakfast: Masala Dosa, Vada 11:50 Lunch at Matrushri Tarigonda Vengamamba Anna Prasadam Centre (Cabbage Curry, Sambar Rice) 13:20 Trip to Papavinashanam,  Aakasaganga  and Venugopal Swamy Temple (Up H...

నాలుగు దశాబ్దాల కాలం

 నాలుగు దశాబ్దాల కాలం నా జీవితంలో గడిచిపోయాయి మొదటి దశకం ఎలా ముగిసిందో గురుతే లేదు చిన్నతనం కదా రెండవ దశకం నా జీవితం లో కీలక మజిలికి దారి చూపింది మూడవ దశకం నా జీవితం లో పెను మార్పులు సంభవించాయి నాల్గవ దశకం పూర్తి కాగానే నా భార్య పలుకు: నువ్వేమి చంటి పిల్లాడివి కాదు పుట్టిన రోజులు జరుపుకోవటానికి. కొత్త బట్టలు వేసుకుంటే నీకు మర్యాద దక్కదు. ముసలాడివి కావటానికి ఎంతో సమయము లేదు, సంబరం ఒకటా నీకు..! అపుడు నాకు అనిపించింది.. నలభై ఏళ్లకే ముసిలివాడినా దానికి కూడా ఏదో ఒక రోజు ముసలితనం రాక మానదు. ఐనా తప్పు నాది కూడా ఉందిలే తనని గారం చేయటం ప్రతిఫలంగా తాను నన్ను దూరం పెడుతూ వస్తోంది..! దాని మూలానా ౭ ఏప్రిల్ ౧౯౮౫ ఒక గుర్తుగా మిగిలిపోనుంది! అది నేను పుట్టిన రోజు మరి. నేను తనకి సౌభాగ్యాన్ని ఇస్తే తాను మాత్రం నా సంతోషాన్ని దూరం చేసేసింది. పిల్లల యోగక్షేమాల మూలానే బ్రతుకుతు తనని సుమంగళిగా సమాజంలో పరిచయం చేస్తున్నా

Tappu Kero?

 Pena Kuniko Dhaab en Dekan Mai Vataar Paani Piyunchu Kee Kacha.. Vela Karan Heta Otaarotho.. Dhaapan Paani Peelen.. Zor Zor Baldaayikacha.. Mana Baarakaado.. Dhaabema Dhakeldino Ken.. Gumpuma Aataani Ona Chooro Chooro Kutnaakan, Ona Baar Khyaanch Laaye Kacha.. Tappu Kero?

Fragile

 true emotions are fragile, they are outcomes of genuine feelings, which, are delicate, that only a few can handle with utmost perfection. ~sri

Puzzle

 "Life is a Jigsaw Puzzle, we are always incomplete at certain stages of Life, some hold our pieces, until we reach them. But, the problem is, once the puzzle is complete, Life comes to an End"

ऐ जिन्दगी

 जिस दिन तू रूठेगी, वह दिन मुझे याद दिलाना कितना रुलाया था मुझे तुम मेरे अपने ही जंग में जिस दिन तू रूठेगी, वह दिन मुझे याद दिलाना कितना रुलाया था मुझे तुम मेरे अपने ही जंग में कायनात थे कइ खोये खोये से, ऐ जिन्दगी मजबूर था मैं बस समय गवाह रहा है साथ में कायनात थे कइ खोये खोये से, ऐ जिन्दगी मजबूर था मैं बस समय गवाह रहा है साथ में दूर दराज सपने कई बिखरे तरस आये सन्नाटे में आखिरकार समेटे कुछ मगर दे दिये अपनों को याद में दूर दराज सपने कई बिखरे तरस आये सन्नाटे में आखिरकार समेटे कुछ मगर दे दिये अपनों को याद में याद रख ऐ जिन्दगी मौत के माहोल में न कुछ तेरा न कोई मेरा यह सब किये कराये कर्ज का घिनौना खिलवाड है जीवन के जश्न में याद रख ऐ जिन्दगी मौत के माहोल में न कुछ तेरा न कोई मेरा यह सब किये कराये कर्ज का घिनौना खिलवाड है जीवन के जश्न में मिले राह में रिश्ते कई छूटे टूटे कई दहाड में कालचक्र फिर सभी समेटे इकरार बेकरार में मिले राह में रिश्ते कई छूटे टूटे कई दहाड में कालचक्र फिर सभी समेटे इकरार बेकरार में

Individuality

 నా అస్తిత్వం, నా మనోగతం గురించిన విషయాలు నాకు తెలిసినంతగా నీకు తెలియదు. ఇదే నిజం.. తెలియని వాటి గురించి ఆరా తీసీ హేళన చేయటం పరిపాటి *కాదు* .

The Arid S[R]eason

Leaves strewn apart, like withered hands The breeze, a furnace, hot and grand Some seek refuge, in culinary delight Omelettes of ostrich, in the Sub Sahara's light Others, in Arizona's burning land Roast turkey, a respite from the sand But the heat remains, relentless and bright A season of extremes, without a gentle night But winter is nowhere to be seen, Those icicles, those avalanches, a distant dream. Frosty, foggy nights, a fading past, The neural aura of lights, forever to last. Now resides in the memories, a bittersweet refrain, Echoes of a season, lost in the arid plain. The mind recalls the chill, the snow's soft kiss, A fleeting reverie, of winter's vanished bliss.

మంచితనం

 మోసం తెలియని వారిని మోసం చేయాలనుకోవటం దుస్సాహసమే ఔతుంది. మనషులం చూడలేదనుకుంటాం కాని భగవంతుడు పైనుండి గమనిస్తూనే ఉంటాడు.. తస్మాత్ జాగ్రత్త

కన్నులు

 తడి కన్నులు మనసు ప్రతిబింబాలు మది తలపులు పగిలిన గుండె ఆనవాలు

මනසු

 Sri India at 77y [15082024]: మనసు ఒక తెల్ల కాయితం మంచి జ్ఞాపకాలను భావాల సిర తో అచ్చేసుకో మనసు ఒక ఎక్పోజర్ ఫిల్మ్ ప్రకృతి అందాలను భద్ర పరుచుకో మనసు ఒక లేలేత పూల కొమ్మ మృదు మధురంగా మంచిని నెమరేసుకో

Proficiency

 Proficiency does not only mean how efficient you are in tackling a situation, it also means, how efficient you are in averting bottlenecks while you face any challenge in life, whatsoever the circumstances be

ఋణానుబంధాలు

 నీకు నాకు నడుమ బంధం ఎలా సాధ్యం.. ఏ జన్మలోనో నాకు నీవో, నీకు నేనో ఋణపడి ఉంటాము. ఆ ఋణ పాశమే ఈ మన బంధం.. మనలో ఏ ఒక్కరి ఋణం ఈ జన్మ కు తీరి పోతే.. ఇక అంతే వీడ్కోలు..!