అగ్నిని నేను

బంగారు వర్ణాన్ని కలిగి ఉన్నాను 
నేను స్వచ్చమైన అంగారాన్ని 
వస్తువు కాను కాని అన్ని నాలోనే సమాయతమౌతాయి 
పంచభూతాల్లో ఒకటిగా పిలువబడే అగ్నిని నేను 

 నాలో దర్పం లేదు అహం భావం లేదు 
పేద గొప్ప అన్న వ్యత్యాసా లేదు 
ఆశలానే కట్టెలను సైతం జీర్ణించుకునే శక్తిని నేను 
రంగులతో సంబంధం లేదు అన్ని వర్ణాలు నాలోనివే 

నిటారుగా పైకే చూస్తూ వుంటాను 
 పంచభూతాలతో తప్పితే ఎవరికీ భయపడని 
అగ్నికీలాన్ని నేను స్వచ్చతకు నిరడంబరతకు మారుపేరు నేను 
తాకే ప్రయత్నం చెయ్యలేరు ఎవరు నన్ను దోషిగా నిలబెట్టలేరు 

అణువంత రావ్వనే కాని మండే అగ్నిగోళాన్ని  నేను
జీవకోటి లో ఆత్మజ్యొతినై వెలిగి వున్నాను 
జీవాత్మ కు పరమాత్మకు లంకె కలిపే అఖండ జ్యోతిని నేను 
మలినాన్ని వెంటనే ఎగురవేసే నిర్మలత్వం నా సొంతం 

Image Courtesy: Google Search

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం