గాలిని నేను

 అందరిలో ఊపిరిలా వేలిసాను
ఉచ్వాస నిశ్వాసలలో తేలుతుంటాను
అది నాది ఇది నాది అని పలకనే పలకను
అన్ని సరిసమానమే నాకు

అప్పుడప్పుడు ఊయలను కదుపుతూ ఉంటాను
పచ్చిక బైళ్ళపై తుళ్ళుతూ నాట్యం చేస్తుంటాను
పండిన పళ్ళను తెంపుతూ ఉంటాను చిటారుకొమ్మన చిరుగాలినై

దుమ్ము ధూళి ఏదైనా గాని ఎండా వానా ఏదొచ్చినా గాని
నా పయనం ఆగదు నేను లేనిదే లోకం సాగదు
గాలి అంటారు నన్ను నీ గుండెలోతులో ప్రతి అణువణువునా ఉన్నాను

Popular Posts