నీరుని నేను

మచ్చలేని నిర్మాలత్వానికి ప్రతీక నేను
గమ్యామేరిగిన బాటసారిని నేను
నాలోనే జీవమున్నది
నాలోనే గతి ఉన్నది
గతి గమనం కలగలిపి పారే గుణం కలిగింది

స్వచ్ఛమైన సెలయేరుని నేను
పంచభూతాల్లో నాకు నేనే సాటి

నీ దప్పికని తీర్చి నీలో నిండి ఉంటాను
నీరుని నేను పారే ఏరుని నేను
బాధకలిగితే కన్నీరుగా మారి ఓదార్చుతాను
హాయికలిగితే ఆనంద భాష్పాలై  మనసు నిండిపోతాను

Popular Posts