రాధిక కృష్ణ

కృష్ణ .. 
మనసే నీలోన దాగే ఎలానో 
నీ పిలుపుకై వేచి చూసే ఎలానో 
మురళి గానం రవళించ గానే కాళింది తటికై పాదాలే వెతుకుతూ 
నీ పదముల చెంతకు చేరేనా మాధవా 
మనసు మందిరాన నిను కొలువుంచానో లేకా నీవే నా మదిలో నిండి నన్నే పలకరిస్తున్నావో ! 

రాధిక ..
నీ కాలి అందియల సవ్వడి వింటూ ఇలా
వసంతం లా బృందావని నా మురళి చేతబూని
వేచి వున్నా మధువని అంతటా నిశాబ్దమంతా
పరిపరివిధాల కోలాహలమైయ్యింది నీ రాకతో
నను తలిచేవని వేణువు మౌనమే దాల్చేనా
రంగు రంగుల కాలి మువ్వల సవ్వడులే ఇలా సీతాకోక చిలుకలయ్యేనా   ఓ మాధవి !!


Popular Posts