చిరునవ్వుల చిరునామా

మనసు కు వయసు లేదు 
పసితనమే మనసుకి హద్దు 
కల్మషం లేని హృదయాలు 
పసిపాప నవ్వుల్లో తెనేసరాలు 

మనసులో ఎన్నో బాధలున్నా 
నవ్వటానికి ప్రయత్నం చేస్తుంది 
మోముపై అలసటే కనిపిస్తున్నా 
మనసు మాత్రం అలసట ఎరుగదు 

చిరుచినుకుల ఆకాశానికి హరివిల్లే అందం 
మౌనం నిండిన మనసుకి చిరునవ్వే అందం 

కొసమెరుపు : అలా అని పలకటం మానేయ్యకండి 
మాటల ప్రవాహమే సంతోషానికి నాంది 
ఆ సంతోషాల మనసుకి చిరునవ్వే సంతకం కావాలి 
ఐతే ఇంకేం ఆలోచిస్తున్నారు పెదవంచులను విప్పార్చి ఓ చిరునవ్వేయండి మరి !! :)

(చిరునవ్వుల చిరునామా .. నా బంగారు స్నేహికకు అంకితం ఈ కవిత. )

Popular Posts