భూమిని నేను
రాయిని కాను రాప్పని కాను నేనే నేను
రాయి నుండి పుట్టాను నిన్ను మోస్తున్నాను
నీవు నడిచే దారి పొడువునా నీతోనే ఉన్నాను
ఊదారంగు పూసుకున్న నదిలో మన్నుని
బంగారు వర్ణం అద్దిన పొలం లో మృత్తిక ని
ఎర్రగా మారినా పచ్చగా మారే భూమిని
గింజని నాలో నీవు నాటినా
మొక్కగా సాకి నీకు అందిస్తాను
నీరు నీవు కొంచమే పోసినా
నీ కడుపు నింపుతాను
రాయి నుండి పుట్టాను నిన్ను మోస్తున్నాను
నీవు నడిచే దారి పొడువునా నీతోనే ఉన్నాను
ఊదారంగు పూసుకున్న నదిలో మన్నుని
బంగారు వర్ణం అద్దిన పొలం లో మృత్తిక ని
ఎర్రగా మారినా పచ్చగా మారే భూమిని
గింజని నాలో నీవు నాటినా
మొక్కగా సాకి నీకు అందిస్తాను
నీరు నీవు కొంచమే పోసినా
నీ కడుపు నింపుతాను