ఆకాశాన్ని నేను

నీలమై నిఖిలమై అఖిల జగత్తుకే తలమానిక నేను
నిర్మలత్వానికి ప్రతీక నేను మబ్బులపై విహరిస్తుంటాను
కాలానుగుణంగా రంగులు మార్చినా గుణం మారలేను
పగలంతా నిండు నీలం నేను సాయకాలం గోధూళి వర్ణం నేను
తిమిరమైతే కాటుక కన్నుల కంటిపాప నలుపు నేను చుక్కలనే చుపిస్తుంటాను

పంచాభూతాలలోని మూడిటిని నాలోనే దాచుకున్నాను
నీరుని వాన లా నిప్పుని ఉరుములా గాలిని నాలో ఇమడ్చుకున్నాను
రంగులన్నీ కలగలిపి వాన వెలిసే సమయానా హరివిల్లునై కనిపిస్తాను
ఆకాశాన్ని నేను నీ ఛత్ర ఛాయను సూర్య చంద్ర తారకల దర్శిని నేను

Popular Posts