Posts

Showing posts with the label Poetry

కనుమరుగు

ఎగిసే అలను నేను.. ఒడ్డు చేరువైతే కనుమరుగౌతాను వెలిగే కొవ్వొత్తి నేను.. కరిగి కాంతి పంచుతు కనుమరుగౌతాను వెన్నెల వీచిక నేను.. అమవస నిశిధిలో కనుమరుగౌతాను కురిసే మేఘం నేను.. చినుకులతో సందడి చేసి కనుమరుగౌతాను

ఏడుకొండలవాడు ఏడువందలు ఏడు రంగులు ఏడు స్వరాలు

స్నేహానికి స్నేహమే హద్దు ప్రత్యామ్నయం మరి లేదు నమ్మకమనే పునాది పై నిర్మింపబడిన నిరాడంబరతకు నిఃస్వార్థ నిర్వచనమైన స్నేహమే నాకు బలం ఏనాటికైనా శ్వాస వీడి ఉండగలరా ఘడియైనా స్నేహమే ఊపిరి నాకు స్నేహానికి లేదేది సాటి స్నేహాన్ని మించినదేది లేదు రాదు దానికి పరిపాటి సప్తశత పడిలో అడుగిడుతున్న నా స్నేహబంధానికి అంకితమిస్తు అంతా మంచే జరగాలని ఈ స్నేహం కలకాలం సాగాలని మనస్పూర్తిగా ఆశిస్తు 700

మౌనవీణగానం

మాటరాకా మౌనం ఎదురైతే నిను నిన్నుగా అర్దం చేసుకునే వారి కళ్ళలో చూడూ.. నీవు చెప్పదల్చుకున్నదేమిటో వారికి అవగతమౌతుంది.. నీ మనసు కుదుట పడుతుంది..!

సమ్మర్ స్పెషల్ తికమక కవిత

సమ్మర్ హీట్ కూల్ డౌన్ కూల్ డౌన్.. చిత్ర విచిత్రమైన కవిత.. గూటిలో డప్పులు లయబద్దంగా సోపానమై నిలుచునా.. డనడనాడన్ దరువే తీన్మార్ కాగా.. కాగడాల వెలుగులో చిందేవేయగా చెవులకే చిల్లులు పడగా.. జనాలందరు వామ్మో వాయ్యో అంటు పరుగులు తీయఁగా.. కెవ్వు కేకా మండే ఎండలకి ట్యుస్డే ఫీవర్ కి లంకే కుదురునా వెడ్నస్డే వానలోస్తే థర్స్ డే థిల్లానాకి ఫ్రైడే చలిగాలికి సాటర్డే చితికిలబడ్డాడు సన్డే సన్నుడి వెచ్చదనం కొఱకు గూటిలో.. రిపీటే.. తాటి ముంజలతో మ్రోగాలి డంక బాకా

ఏమని వ్యాఖ్యానించగలను నేను..!

ఏమని వ్యాఖ్యానించగలను నేను..! నా కనులు చెమ్మగిల్లి చెంపను తాకితే..!!  ఏమని వ్యాఖ్యానించగలను నేను..! నా మదిలో భావాలన్ని అక్షరాలై ఉరకలేస్తే..!!  ఏమని వ్యాఖ్యానించగలను నేను..! నా కనులకెదుట జ్ఞాపకాలన్ని కదలాడితే..!!  ఏమని వ్యాఖ్యానించగలను నేను..! నా మనసే మాటరాకా మౌనాన్ని ఆశ్రయిస్తే..!!

నిఖార్సైన నిజం

ఈ కాలం లోను ఏ కాలం లోను కల్తి లేనిది అమ్మ ఆప్యాయత.. కల్మషమెరుగనిది నాన్న దీవెన.. సాటిలేనిది స్నేహానుబంధం.. విశ్వసనీయత విధేయత నమ్మకం నిరాడంబరం మచ్చలేని గుణాలు..

ప్రతి ఘడియ కదిలేను త్రివేణి సంగమమై

జీవితం కాలమనె తెరచాప తో సాగే పయనం గతుకుల అతుకులతో పడుతు లేచే కెరటం ఆడంబరాల అదుపుతో కుదుపు లేకా సాగే ఝరి కపటమనే భావన దరిచేరని జీవితానికి సరాసరి మనిషి మనిషికి నడుమ కానరాని తెర అహంభావం నిత్యం సతమతమయ్యేను తనకదే కదా అనుభవం కాలికి గాయం ఐతే ఓర్చుకోవచ్చు మనసుకి గాయం ఐతే ఏడుపే వచ్చు మంచి అనే భావన ప్రతి ఒకరిలో వెలిగే దీపం చమురు మాత్రం ఒక్కో దీపానికి భిన్నం సహేతుక పలకరింపులన్ని అజ్యపు దీపాలే మసిబారని మనసుకు దర్పణాలే స్వార్థమనేవి కర్పుర హారతులే దిస్టి తీసి కన్నులకు హత్తుకోగా నల్లగా చేతికి మసి అగాధాల మాటునా రగిలే నిప్పు ఎరుగని కొలిమిలివే మనస వచస కర్మణ త్రికరణశుద్ధిగా ఆచరించే జీవితపు సోపానాలివే అచేతనంగా అనాలోచితంగా అప్రయత్నంగా అగమ్యగోచరమై కాలమే సమాధాన పర్చగా ప్రతి ఘడియ కదిలేను త్రివేణి సంగమమై

పదాల లోగిలి

మనసుకి మారుమాట మెదలక మారిపోయే మరునిమిషానా మాటలే మూగబోయి మౌనముగా మారేనేమో.. నవ్వులన్ని నిలువరిస్తు నవ్యతను నిదర్శిస్తు నగుమోమున నవకాంతులు నెలకున్న నిమిషానా వసంతమున విరితోటలో విహరిస్తే వర్ణాల విహారి..విరవిగా విరబూస్తాయి వేవేల వర్ణాల విరులు..

సుస్వర సుమధుర కావ్య గుళిక..!

నా మనసు ఆహ్లాదంగా ఉన్నా, అల్లకల్లోలంగా ఉన్నా వస్తాయి కవితలు ఓక్కోసారి లుతవిక కూడాను. కవిత: కనులకే వినిపించే తతంగం.. తవిక: తనువు వికసించే కవనరాగం.. కనబడదు భావం.. వినపడదు మాట.. తపన మాత్రం కవిత.. ప్రేరణాత్మక మహిమాన్వితమగునేమో కదిలే కాలానికి సాక్షిగా.. పదాల కూర్పులో జ్ఞాపకాల వీచిక.. సుస్వర సుమధుర కావ్య గుళిక..!

సాగే జీవన పయనం

కలత నిదురలో కనురెప్పల అలికిడులు వింటు కరగని నిశిధిలో కాంతి కిరణమై వెలుగు ప్రసరిస్తు కవిత పదాలలో ఓనమాలలో దాగిన భావమై నిలుస్తు గాలివానను తనలో దాచిన ప్రకృతిలా మారిపోతు కాలానికి కలానికి ఎదురు నిలుస్తు ఒక్కొక్క బంధాన్ని కలువుకుంటు సెలయేటి జలపాతంగా నిలుస్తు కరిగే కన్నీటి వెనక లోకాన్ని చూపించే కాంతినవుతు నిలువున కాలుతునైనా పదుగురికి వెలుగు చూపుతు దివికి భువికి వారధిలా మానవత్వాన్ని చాటుతు కలకాలమిలా ప్రకృతిలో లీనమవుతు... సాగే జీవిత పయనం..

కరిగి కన్నీటి చిరుజల్లాయేనా

కన్నుల అంచుల్లో కన్నీటి ధారా కనులకు చలువ అందించేనా మనసులోని బాధను కడిగేనా కనువీడిన చిరు చెమ్మ చెంపకు జారేనా చిరునవ్వులే కానరాకా కనుమరుగాయేనా

మొదలు తుదలు

మచ్చలేని చంద్రుడిని చూడగలరా ఎవరైనను నీలాకాశం పడిందేమో అవాకు చివాకు పరాకు పెనుగాలి హోరులో వాన చినుకులో చిందులు తుళ్ళి కుకుకు అంటు కోయిల రాగం మరల వినిపించింది రింగు రింగులుగా తిరిగే రంగులరాట్నం కానవచ్చిందా?

అది కతల్ కైతల్ పుస్తకం కాది

ఔను మరి ఒక్కో పాలి ఘాట్ రోడ్ వస్తది.. నత్త నడకన పయనం.. మరో మారు యూ టర్న్ లు, హేయిర్ పిన్ బెండ్లు.. కొన్ని చోట్ల రోడ్ అండర్ రిపేర్ టేక్ డైవర్షన్ లు మరి కాస్త దూరానా న్యారో లేన్లు స్పీడ్ బ్రేకర్లు.. గోతులు గతుకులతో రహదారికి ఊడినా తోలు.. ఐనా తప్పదు కట్టాలి టోలు.. యేగారుమనుక లువాభా కరానకా లురాక్షఅ తిప్పి ప్పితి పేజిలు ఇటుకటు యేటాకిటుఅ రాసే ముందు సిర పాళి పెన్ను బర్రా బర్రా రాతలకి విరిగేను వెన్ను అది కతల్ కైతల్ పుస్తకం కాది ఎక్కాలు రాసేటి లెక్కల *స్క్వేర్ రూల్* బుక్.. అక్షరాలవే భావాలను మార్చి కవితకు ఇవ్వదలిచాను మరి బ్రాండ్ న్యూ లుక్.. (పదప్రయోగం సరదాగా.. ఎవరి మనసు గాయపర్చటానికి కాదు)

Pain Teaches..

Every Pain Teaches a Lesson.. Every Lesson has a Moral.. Every Moral Teaches Humanity.. Every Humanity has Dignity, and Dignity Teaches Humbleness..

ఈ టు ఎమ్ డీ టు యూ

భావగీతాల మాటునా ఏవో తెలియని మూగ వెతలు కన్నీటి సంద్రం మాటునా ఏవో కలతల గీతాలాపనలు ఈజి టు మింగిల్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఇజ్ ది రియల్ లైఫ్ !

కరిగి కన్నీరాయేనా

కన్నుల అంచులో కన్నీటి ధారా కనులకు చలువ అందించేనా..? మనసులోని బాధను కడిగేనా..? కనువీడీన అశ్రువు చెంపకు జారగా మదిలోని వ్యాకులత అంత కరిగి కన్నీరాయేనా..!

మాతృమూర్తి గొప్పతనం

మాతృహృదయమే కోవెలైతే వెలిగే చిరు దీపం ఒడిసి పట్టుకుని బుజ్జగించే తల్లి మమకారం కాలమే కదలాడినా మారని వాత్సల్యం అదే అదే ప్రతి మాతృమూర్తి గొప్పతనం కని పెంచే సహనశీలి తాను కనికరించే కారుణ్యం అల్లరి చేసినా మురిపెం చేసేను కదా ప్రతినిత్యం కదలాడే కన్నుల వాకిలిలో అనునిత్యం అదే అదే ప్రతి మాతృమూర్తి గొప్పతనం (నా ప్రాణస్నేహితురాలి మానసపుత్రిక *లమ్* కు అంకితం)

ఒక్కో ఘడియ కదలాడే వేళ

ఎగిసే అలనా నేను.. సంద్రం సడి చేసే వేళ ఒడ్డుకు చేరి సైకతపాదం తాకుతాను..! కురిసే చినుకునా నేను.. మేఘాలు ఉరిమే వేళ మిన్నుకు భారమై మన్నులో ఒదిగిపోతాను..!! కదిలే కాలమానమా నేను.. ఒక్కో ఘడియ కదలాడే వేళ జ్ఞాపకాలుగా మారి కాలగర్భంలో కలిసిపోతాను..!!!

చలనం లేని కాలం చలికాలం

Image
వినీలాకాశానా సుర్యరశ్మి ఏమాయేనో చలి ధాటికి వెచ్చగా పలకరింపులే అందకా గజగజ వణికేను ధరణి మంచు తెరలు గుట్టలపై దట్టమాయేను పచ్చని చెట్లు సైతం చలికి కిమ్మనకా ఊరకుండేను కడర్టకట్కట్ రాగమే వినిపించేను హేమంతమిదోయి కడర్టకట్కట్ కడర్టకట్కట్ శీతాకాలం ఇదీ బాబోయి చక్కిలిగింతలు పెట్టినా నవ్వు కాదు చలిపుట్టే కాలం తుషార నీహారికలా చలనం లేని కాలం చలికాలం

అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి

అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి పదాల కూర్పులో నా ఎదుట కవితయ్యి నిలిచినాయి  బాధగా వుంటే పదాలే తారు మారయ్యి  నవ్వు తెప్పించాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి కవితలో ప్రతి పదం మేమే అంటూ భావమై నిలిచాయి కొన్ని అచ్చులు కొన్ని హల్లులు కలగలిపి చిందాడాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి పలకలేని భాషను సైతం వాటిలో దాగి వున్నాయి పలకరిస్తే కవితల మాలలో నిగుదితమై పులకించాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి