Posts

Showing posts from 2015

చలనం లేని కాలం చలికాలం

Image
వినీలాకాశానా సుర్యరశ్మి ఏమాయేనో చలి ధాటికి వెచ్చగా పలకరింపులే అందకా గజగజ వణికేను ధరణి మంచు తెరలు గుట్టలపై దట్టమాయేను పచ్చని చెట్లు సైతం చలికి కిమ్మనకా ఊరకుండేను కడర్టకట్కట్ రాగమే వినిపించేను హేమంతమిదోయి కడర్టకట్కట్ కడర్టకట్కట్ శీతాకాలం ఇదీ బాబోయి చక్కిలిగింతలు పెట్టినా నవ్వు కాదు చలిపుట్టే కాలం తుషార నీహారికలా చలనం లేని కాలం చలికాలం

అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి

అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి పదాల కూర్పులో నా ఎదుట కవితయ్యి నిలిచినాయి  బాధగా వుంటే పదాలే తారు మారయ్యి  నవ్వు తెప్పించాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి కవితలో ప్రతి పదం మేమే అంటూ భావమై నిలిచాయి కొన్ని అచ్చులు కొన్ని హల్లులు కలగలిపి చిందాడాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి పలకలేని భాషను సైతం వాటిలో దాగి వున్నాయి పలకరిస్తే కవితల మాలలో నిగుదితమై పులకించాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి 

ద్వంద్వం

మనసులో భావం మెదిలితే.. కన్నులలో కన్నీరే చేరుతాయి ఆ కన్నీళ్ళలో కొంత ఆనందభాష్పాలు మరికొన్ని నిర్వేదపు చినుకులు మునివేళ్ళ చివర  అక్షరాలే కదులుతాయి ఆ అక్షరాల్లో కొంత పదాలు మరికొన్ని పదాలు దాగి భావమే కనిపించే ఊసులు పెదవంచున నవ్వులే పూస్తాయి ఆ నవ్వుల్లోన కొంత ఆనందం మరికొన్ని సంతోషపు ఆనవాళ్ళు   

చిరు చీకట్లు

Image
  చిరు చీకట్లు కమ్మినా నిశిధినా.. కాంతి పంచే వెలుగు వుంటుంది చినుకులే ధారాపాతముగా కురిసినా.. మదిని తడిమి చల్లబరుస్తుంది దారంతా వాగునే తలపించినా..ఇంద్రధనువు ఆకశానా ప్రస్ఫూటమౌతుంది వెన్నెల వెలుగును చూడు నిశిధి ఎందుకు చీకటిగా ఉంటుందో తెలుస్తుంది చల్లని చినుకులను తడిమి చూడు నీలిమేఘాల మాటునా ఉరుమెందుకో తెలుస్తుంది పారే సెలయేటిని చూడు ఉరుకులు పరుగులతో కొండకొనలు అవలీలగా దాటేస్తుంది నలువైపుల చీకటున్నా చమురు దీపం వెలుగు దేదీప్యమానమై వెలుగుతుంది బీటలువారిన భూమి కూడా చిరు చినుకుతో పులకించి మెత్తబడుతుంది సెలయేటి గలగల సంద్రంలో కూడా అలల ఉదృతిలో ఉరకలేస్తుంది

వేవేల వర్ణాల పూలతోట పచ్చని ప్రకృతి వేసే పూలబాట

కడలి కెరటం లో ఏవేవో భావాలు నిత్యం ఎగసిపడే తరంగాలు ఒడ్డును తాకాలని కొన్ని సాగర గర్భాన మరికొన్ని ఆకాశం లో వేవేల వర్ణాలు వర్ణనకు వర్ణాలే అలికె అక్షర శరాలు నీలాకాశపు వర్ణం గడియకో మార్పు భువిపై మనిషికి వాసంతమే ఇచ్చెను ఓర్పు వేవేల వర్ణాల  పూలతోట పచ్చని ప్రకృతి వేసే పూలబాట   

జీవితానికి ఇదే నిండైన నిర్వచన

కదిలే కన్నుల్లో కలలే లోకమై ఇమిడినట్టు  ప్రతి గుండెలయలో ప్రాణమే ఊయలూగినట్టు   రెప్పల అలికిడిలో అశ్రువు బిందువు బాధకి ఆనందానికి నిఖార్సైన నెలవు  ఆనందరాగమే రవళించే వాసంతం  కోయిల రాగాలే ఆలపించెను కాలం  ఊపిరే ఆయువుకు ఆలంబన  జీవితానికి ఇదే నిండైన నిర్వచన   

భావాలు

కావ్యం కాదు కవనం కాదు అక్షరాలతో అల్లిన భావగీతం ఇది పదాల మాటున దాగిన భావాలకు ప్రతిరూపం ఇది కరిగే మేఘానికి నీటి  బిందువులే పరమావధి నీలాకాశాన వెలిసే రంగుల హరివిల్లె సన్నిధి చిరు చిరు పలుకుల మనసులోని భావం పలుకులై మాటగా వేలిసేను కదా మౌనమే అలంకారమై 

జీవకోటి లో ఒదిగి వుండే మానవత్వం ఒక్కటే

కన్నుల్లో దాగిన భావాలు కలలుగా మెదిలేను నాసికలో ఊపిరులూదే గాలి గమనం ఆయువై నిలుచును నాలుక వల్లించే పలుకులే మనసు అంతరంగం తెలిపేను కంటి భాషకు కన్నీళ్ళు ఆనందభాస్పాలు నాసికానికి ఘ్రాణ శక్తి మరో వరం రుచినేరిగిన జిహ్వకు పలుకులు తేనెలొలుకు ఆకాశం ఒక్కటే భూమి ఒక్కటే మనిషికి ఉనికినిచ్చె ప్రాణం ఒక్కటే జీవకోటి లో ఒదిగి వుండే మానవత్వం ఒక్కటే

ఏమౌతాయి

నిప్పులు కురిపించే కన్నుల్లో కన్నీళ్ళు ఉంటాయా  లేకా   నిప్పుల వేడిమి తాళలేక క్షణంలో  ఆవిరైపోతాయా పెదవులకందని పదాలు మాటలా మెదులుతాయా  లేకా  మౌనాన్నే ఆశ్రయించి  బేలగా  మిన్నకుండిపోతాయా  వెల్లువలా ఉప్పొంగే ఆశలే  ఘోషగా ఎగిసిపడతాయా  లేకా అత్యాశల  ప్రవాహం లో కొట్టుకుని నీరుగారి పోతాయా రాగం భావం కలగల్పితే పాటగా మారి మదిని తాకుతాయా  లేకా సంగీత కావ్యమై పదబంధమై గుండెతంతిను మీటుతాయా    ఏ మౌ తా యి  

ఓ వింత కథ

ఐతే ఇప్పుడొక చిన్న కథ..  మరి కథ అనగానే అనగనగ అనగనగ అంటూ మొదలు పెడతాను అనుకున్నారు కదా .. కాని అలా కాదు  ఇది కథ కాదుగా మరి..  మరి కథ కాని కథకు కథ అని ఎందుకన్నట్టు ఏమోలే నాకేం తెలుసు  మనసు బాగోలేకుంటే కథ,  మనసు ఉల్లాసంగా ఉండాలంటే కథ,  అంటూ వింటూ ఉంటాం కదా అని ఈ కథ..!   'బాబు..  కథ కథ  అంటున్నావు తప్పితే కథ ఏమిటసలు..'  అనే కదా  సందేహం.. వస్తున్నా అక్కడికే వస్తున్నా ..  జరా కాస్త చోటిస్తే మీ అందరి మధ్య లో కుర్చుని చెబుతా .. అలా అని నన్ను మధ్య లో పెట్టి కుమ్మెయొద్దు సుమీ.. కథ అడ్డం తిరుగుద్ది. 'అబబ్బబా మళ్ళి  కథ అంటున్నాడు కాని కథ ఏమిటో చెప్పకుండా వున్నాడేంటి  చెప్మా అనే కదా.. ఆగండాగండి ఇదుగో కథను విని నిలబెట్టాల్సిన బాధ్యతా మీదే  నా  పూచి ఏమి లేదు వింటున్నారా (ఐన ఎలా వింటారు, తిలకిస్తున్నారు కదా  .. హ్మ్మ్..  ఔను తిలకించండి!)  'అది సరేలేవయ్య .. అసలేమిటి సంగతి ఈ కథ లోని భావం అంటే '.. అడిగారు .. కథ లో కథాకమామిషు వుంది కదండీ అందులో కమామిషు తీసివేస్తే మిగిలేది .. మళ్ళి...

గురుతున్నదా

Image
నింగి అంచుల్లోన కరి మబ్బులే వెలిశాయి చిటిపొటి పాదాలకే పరుగులు నేర్పుతు చిందాడిన ఆ సుమధుర క్షణాలు ఉరుకలేస్తు ఉరుమునే మైమరిపించే కేరింతలు  గురుతున్నదా.. గురుతున్నదా.. ఝల్లు ఝల్లున కురిసే వాన తో ఘల్లు ఘల్లున మువ్వలే పలికాయి వరదలైన వాన నీటిలో పాదాలే నడయాడుతు నర్తించాయి రంగుల రాట్నం గిర్రున తిరిగే హరివిల్లే రంగులతో విరియగ మనసే పులకరించి నాట్యమాడిన ఆ సందర్భం  గురుతున్నదా.. గురుతున్నదా..

चाँद की चांदनी

Image
पल के पलकों  को टपकने से न जाने दिन रात में बदल जाती है छोटी सी मुस्कराहट न जाने कितने ग़मों को चकनाचूर कर देती है जीवन से बड़ा कौन है जीवन तो एक कोरा कागज़ है जीवन तो एक कोरा कागज़ है बस गीत गाता चल गीत गाता चल ओ राही मुसीबतें भी मिट जाएंगी उस चाँद की चांदनी में धुला संसार नया उमंग दिलाता है चाँद  की रोश्नी में धब्बा भी दिखाई नहीं देता क्योंकि पूर्णिमा के चाँद में चहक भी सफ़ेद नज़र आता है

ఆనవాళ్ళు

కన్నుల అంచులలో ఏమున్నది ? కంట తడి దాచుకున్న కలువ రేకుల్లాంటి కనురెప్పల మాటున అలజడిని ప్రతిబింబించి ద్రవించిన హృదయపు ఆనవాళ్ళే కదా ఆ కన్నీటి ముత్యాలు మాటల్లో తెలుపలేని భావమై మెదిలే సంతోషానికి దుఃఖానికి ప్రతిచర్యలు ఆ కంటి చమ్మలు బాహ్యముగా కాన వచ్చే మనిషిని కనులు మాత్రమె చూస్తాయి కాని అసలు సిసలు మనిషిని మనసు మాత్రమె చూడ గలదు ఎందుకంటే మనిషిని నడిపేది మనసులోని భావాలే భావాలు మనసులో మెదిలే అంతరంగాలే పలుకే నిలిచే భావ అంతరంగ సరాగాలే ఆ సరాగాల మాటునా రాగభావావేశ సుమదురాలే 

రాధిక కృష్ణ

Image
కృష్ణ ..  మనసే నీలోన దాగే ఎలానో  నీ పిలుపుకై వేచి చూసే ఎలానో  మురళి గానం రవళించ గానే కాళింది తటికై పాదాలే వెతుకుతూ  నీ పదముల చెంతకు చేరేనా మాధవా  మనసు మందిరాన నిను కొలువుంచానో లేకా నీవే నా మదిలో నిండి నన్నే పలకరిస్తున్నావో !  రాధిక .. నీ కాలి అందియల సవ్వడి వింటూ ఇలా వసంతం లా బృందావని నా మురళి చేతబూని వేచి వున్నా మధువని అంతటా నిశాబ్దమంతా పరిపరివిధాల కోలాహలమైయ్యింది నీ రాకతో నను తలిచేవని వేణువు మౌనమే దాల్చేనా రంగు రంగుల కాలి మువ్వల సవ్వడులే ఇలా సీతాకోక చిలుకలయ్యేనా   ఓ మాధవి !!

చిరునవ్వుల చిరునామా

Image
మనసు కు వయసు లేదు  పసితనమే మనసుకి హద్దు  కల్మషం లేని హృదయాలు  పసిపాప నవ్వుల్లో తెనేసరాలు  మనసులో ఎన్నో బాధలున్నా  నవ్వటానికి ప్రయత్నం చేస్తుంది  మోముపై అలసటే కనిపిస్తున్నా  మనసు మాత్రం అలసట ఎరుగదు  చిరుచినుకుల ఆకాశానికి హరివిల్లే అందం  మౌనం నిండిన మనసుకి చిరునవ్వే అందం  కొసమెరుపు : అలా అని పలకటం మానేయ్యకండి  మాటల ప్రవాహమే సంతోషానికి నాంది  ఆ సంతోషాల మనసుకి చిరునవ్వే సంతకం కావాలి  ఐతే ఇంకేం ఆలోచిస్తున్నారు పెదవంచులను విప్పార్చి ఓ చిరునవ్వేయండి మరి !! :) (చిరునవ్వుల చిరునామా .. నా బంగారు స్నేహికకు అంకితం ఈ కవిత. )

కుశలమా ! ఓ స్వామి

Image
మనసనే కోవెలలో నిను నిత్యం పూజింతుమే లోకలోకేశ్వర ఓ గరుడధ్వజ మిక్కిలి రూపమున నీవు కొలువుదీరిన క్షేత్రమే పున్యతీర్తమై అలరారే గోవింద ముకుంద మాధవ మదుసూదన చక్రపాణే బృగువునేల్ల కరుణించి కలియుగమున శేషాద్రిన కొలువైన వెంకట నారసింహ పద్మావతి తోడ కొలువైన మలయప్ప నిను కొలిచిన కలుగును పుణ్యమ్ ఓ గోవింద రాజ స్వామీ అనుజ వకుళమ్మ చెంతకు చేరేవా యశోద కృష్ణయ్య  శేష శయన గోవింద గిరిధారి గోవర్ధనోద్దారి  స్వామి కుశలమా !

ఆకాశాన్ని నేను

Image
నీలమై నిఖిలమై అఖిల జగత్తుకే తలమానిక నేను నిర్మలత్వానికి ప్రతీక నేను మబ్బులపై విహరిస్తుంటాను కాలానుగుణంగా రంగులు మార్చినా గుణం మారలేను పగలంతా నిండు నీలం నేను సాయకాలం గోధూళి వర్ణం నేను తిమిరమైతే కాటుక కన్నుల కంటిపాప నలుపు నేను చుక్కలనే చుపిస్తుంటాను పంచాభూతాలలోని మూడిటిని నాలోనే దాచుకున్నాను నీరుని వాన లా నిప్పుని ఉరుములా గాలిని నాలో ఇమడ్చుకున్నాను రంగులన్నీ కలగలిపి వాన వెలిసే సమయానా హరివిల్లునై కనిపిస్తాను ఆకాశాన్ని నేను నీ ఛత్ర ఛాయను సూర్య చంద్ర తారకల దర్శిని నేను

భూమిని నేను

Image
రాయిని కాను రాప్పని కాను నేనే నేను రాయి నుండి పుట్టాను నిన్ను మోస్తున్నాను  నీవు నడిచే దారి పొడువునా నీతోనే ఉన్నాను ఊదారంగు పూసుకున్న నదిలో మన్నుని బంగారు వర్ణం అద్దిన పొలం లో మృత్తిక ని ఎర్రగా మారినా పచ్చగా మారే భూమిని గింజని నాలో నీవు నాటినా మొక్కగా సాకి నీకు అందిస్తాను నీరు నీవు కొంచమే పోసినా నీ కడుపు నింపుతాను

గాలిని నేను

Image
 అందరిలో ఊపిరిలా వేలిసాను ఉచ్వాస నిశ్వాసలలో తేలుతుంటాను అది నాది ఇది నాది అని పలకనే పలకను అన్ని సరిసమానమే నాకు అప్పుడప్పుడు ఊయలను కదుపుతూ ఉంటాను పచ్చిక బైళ్ళపై తుళ్ళుతూ నాట్యం చేస్తుంటాను పండిన పళ్ళను తెంపుతూ ఉంటాను చిటారుకొమ్మన చిరుగాలినై దుమ్ము ధూళి ఏదైనా గాని ఎండా వానా ఏదొచ్చినా గాని నా పయనం ఆగదు నేను లేనిదే లోకం సాగదు గాలి అంటారు నన్ను నీ గుండెలోతులో ప్రతి అణువణువునా ఉన్నాను

నీరుని నేను

Image
మచ్చలేని నిర్మాలత్వానికి ప్రతీక నేను గమ్యామేరిగిన బాటసారిని నేను నాలోనే జీవమున్నది నాలోనే గతి ఉన్నది గతి గమనం కలగలిపి పారే గుణం కలిగింది స్వచ్ఛమైన సెలయేరుని నేను పంచభూతాల్లో నాకు నేనే సాటి నీ దప్పికని తీర్చి నీలో నిండి ఉంటాను నీరుని నేను పారే ఏరుని నేను బాధకలిగితే కన్నీరుగా మారి ఓదార్చుతాను హాయికలిగితే ఆనంద భాష్పాలై  మనసు నిండిపోతాను

అగ్నిని నేను

Image
బంగారు వర్ణాన్ని కలిగి ఉన్నాను  నేను స్వచ్చమైన అంగారాన్ని  వస్తువు కాను కాని అన్ని నాలోనే సమాయతమౌతాయి  పంచభూతాల్లో ఒకటిగా పిలువబడే అగ్నిని నేను    నాలో దర్పం లేదు అహం భావం లేదు   పేద గొప్ప అన్న వ్యత్యాసా లేదు  ఆశలానే కట్టెలను సైతం జీర్ణించుకునే శక్తిని నేను   రంగులతో సంబంధం లేదు అన్ని వర్ణాలు నాలోనివే   నిటారుగా పైకే చూస్తూ వుంటాను   పంచభూతాలతో తప్పితే ఎవరికీ భయపడని  అగ్నికీలాన్ని నేను స్వచ్చతకు నిరడంబరతకు మారుపేరు నేను  తాకే ప్రయత్నం చెయ్యలేరు ఎవరు నన్ను దోషిగా నిలబెట్టలేరు  అణువంత రావ్వనే కాని మండే అగ్నిగోళాన్ని  నేను జీవకోటి లో ఆత్మజ్యొతినై వెలిగి వున్నాను  జీవాత్మ కు పరమాత్మకు లంకె కలిపే అఖండ జ్యోతిని నేను  మలినాన్ని వెంటనే ఎగురవేసే నిర్మలత్వం నా సొంతం  Image Courtesy: Google Search

हैप्पी न्यू ईयर २०१५

Image
कुछ कीमती पल समेट लो यारा  दिल की छुपी बातें याद कर लो  आज का ये साल कल पुराना हो जाएगा  नयी उमंग नयी सोच विचार की धारा अपनाते चलो  पलभर में नए साल की आगमन में  कभी कभी अच्छे सच्चे वक़्त का याद भी करो  अनोखे दोस्त जो बने हैं हाट न छोड़ो कभी उनका  नयी उमंग नयी सोच विचार की धारा अपनाते चलो  हैप्पी न्यू ईयर २०१५  आपका अपना श्रीधर भूक्या  Happy New Year 2015