Posts

Showing posts from 2012

తెలుగుదనం

పలుకు తేనియల తల్లి మన మాతృభాష తెలుగు ముద్దు బిడ్డలై ఆంద్ర జాతి వెలుగు దివ్వేలై సనాతన హిందూ ధర్మ సారథులై రాణి రుద్రమ దేవి వీర వంశ అంకురాలై ఓరుగంటి  భాద్రకాలికాంబ చల్లని సుభాశితమై తెలుగుదనం ఉట్టి పడే భావ కవితల సంపుటి సమహారాలై తెలుగు గంగ గోదారమ్మ కృష్ణవేణి మంజీరా నాదాలై గౌతమి ఒడ్డున  అల భద్రాచల పాపి కొండల సమూహమై ఇల వెలసిన వెంకన్నను కొలిచిన అచ్చ తెలుగు వాగ్గేయకార పద కవిత పితామహుడు అన్నమాచార్య తరించిన తెలుగు వెలుగులై బెజావాడ ఇంద్ర కీలాద్రి పై వెలసిన దుర్గ మల్లేశ్వర స్వామి సన్నిధానం లో పూజ కుసుమమై శ్రీశైల భ్రమరాంబ మల్లిఖర్జునుల ఆశిర్వచానాలై రత్నగిరి అన్నవర సత్యనారాయణుని  సద్బోధ హితులై అరసవెల్లి ఆదిత్యుని కోటి కిరణాలలో ఓ వెలుగు కిరణమై మంగళగిరి పానకాల స్వామీ సింహాద్రి అప్పన్న స్వామీ హేతువులై ... తెలుగు తల్లి వాకిట విరబూసిన మల్లెల తోరణాలై భాసిల్లు తెలుగునకు కోటి కోటి వందనాలు తెలుగు మహాసభలు జరుగుతున్నా నేపథ్యం లో మరియు తెలుగు భాష కు ప్రాచిన భాష హోదా కల్పించిన తరుణం లో ...

21-12-2012... The Real Story and The Myth

There is no apocalypse as it is pre-predicted. The Mayan Calendar might have come to an end on this very day;but there is no proof of what actually will be it on 21-12-2012, i.e. one has no predictions on when this world vanishes. The Planet X or Nibiru is also a myth, since, in this Scientific Yuga, wherein the American Space Laboratory (SkyLab) have been averted in 1979... Humans have placed "Curiosity Rover" on the Martian Lands, can't it be very easy task to avert this "so-called" planetary collision. Moreover, if there were any signs of destruction, it will start to show up some early signs.. which is nowhere to be found. According to Hindu Mythology: There are 4 Yugas Krita, Treta, Dwapara and Kali. Krita 4*4,32,000 years or 17,28,000 years Treta 3*4,32,000 years or 12,96,000 years Dwapara 2*4,32,000 years or 8,64,000 years Kali 1*4,32,000 years or 4,32,000 years. As per current situations, this Yuga has started some 30,000 years ago. So on tha...

My All-time Favourite Song

Vidhaata Talapuna Prabhavincinadi Anaadi Jeevana Vedam Om Praana naadulaku Spandana Nosagina Aadi Pranava Naadam Om Kanula kolanulo pratibimbinchina viswaroopa vinyaasam Yada kanumalalo pratidhwaninchina Virinchi Vipanchi gaanam Aaa... Omkaaram It is the Veda of Life, that has evolved from the thoughts of the Creator Brahma Omkaaram It is the undulated rhythm, that gave responsiveness to the Stem of Life The Whole world's activities gets captured and reflected in the Pond-like Eyes The Song of Brahma is being echoed deep withi the valleys of the Heart Sarasa swara surajhari gamanamau Saamaveda Saaramidi  Ne Paadina Jeevana Geetam Ee Geetam This is the Summary of Sama Veda, which flows as the perennial rivers of Tunes and of Rhythms, which are filled with emotions. It is this Song, which I present before you.. A Song of Life. Virinchinai Virachinchitini Ee Kavanam  Vipanchinai Vinipinchitini Ee Geetam I composed this poetry, in the form of Lord Brahma; I re...

పూదోట

Image
ఇమేజ్ కర్టసీ: crazyfrankenstein.com విరివిగా విరిసిన విరితోట లో అరవిరిసిన వ్యత్యాసం లేని విరులం  మనసునేరిగి మమతానురాగాలు పంచె మానవత్వానికి తలమానికాలం గుండె అంచులు దాటి పొంగి పొరలే ప్రేమలకు ప్రతీకలం నవ సమాజ నిర్మాణ సారథులం తోబుట్టువులం అన్న చేల్లెల్లం ||విరివిగా|| ఎడారి దారిలో ఎందమావులం మంచు తెరల చాటు ఆదిత్యుని కిరణాలం బంధాలకే బాంధవ్యం నేర్పించే అపురూప చిరునామలం తరతరాలు నిలిచిపోయే అభిమానానికి వారధులం ||విరివిగా|| వెన్ను తట్టి ప్రోత్సహించే పెన్నిదులం వెను  వెంటే ఉండి  ముందుకు నడిపించే ఊతలం ప్రేమకు ఆప్యాయతకు నిఖార్సైన గురుతులం అలుపులేని ఆనందాలకు సఖ్యాతకు దేవుడు పంపిన ప్రాణ స్నేహితులం ఒకే రాగం ఆలాపించే ఒకే గూటి గువ్వలం ||విరివిగా||

वक़्त

आज न जाने क्यों एक ऐसा माहोल चा गया है मानो कभी किसी वक़्त पर किसी मोड़ पर  कोई अनजाना पल सा मेरे आगे से होकर गुजर रहा हो इन्ही आँखों में एक नयी झलक सी आ  गयी है लेकिन बस चलता चल राही किसी एक न एक  तौर पर न जाने कहीं कोई अपना जो कभी पहले हम से मुलाक़ात न हो आ जाए   अचानक सी उसे देख हैरान न रह जाना वक़्त ही हमारा प्रश्न है और वक़्त ही उसका उत्तर अब तुम्हे छोड़ चले आये हम इतने दूर की न जाने तुम अब किस मोड़ में ठहर गयी एह तो मुझे पता ही न चला ... ठहरा हुआ सा दिखा वक़्त न जाए कब इतनी दूर हमें लेके  आ गया अब उन बीते पलों से हमे क्या लेना देना ... जो अब और बाकी है उससे हम को आगे बढ़ना चाहिए वक़्त की इस मुश्किल राहो में कहीं न कहीं तो आशा की रोशन आ पड़ती है उसी की तरफ हमें  जाना है ... न जाने किस मोड़ पर हमे और कोई मिल जाए

భావం

కోటి రాగాలు పలికే సంజీవని ఇది అనంత కోటి భావాలు విరబూసే తోట ఇది కుసుమ మేలిత సుగంధాలు వెదజల్లే సుమాల మాలిక ఇది నిండుకొని భావాలు జాలువారే జలపాతం ల ఎగసి పడే కెరటానికి సమతూకంగా నిలిచే అపురూపం ఇది భావం భావనాలు భవ్య రాగాలాపనలు స్వరసందులు  చిరు చిరు దీపికల కలయికల సమాహారం ఇది ఎప్పటికి చివురులు తొడిగే మనోభావాల వృక్షం ఇది సంభావన సద్భావన కలగల్పిన అపురూప ఘట్టం ఇది వెన్నంటి నడిపించే ప్రకృతి  సోయగాలలో దాగి ఉన్న అందాల భరిణ ఇది ఉప్పెన ల ఎగసిపడే భావాల తరంగమే ఇది

Happy Deepawali

ఈ చక్కని దీపావళి మన ముంగిట దీపమాలిక ల మన ప్రేమానురాగాలను ప్రసరింప చేయాలని దుఖం కలహం కల్మషం బాధ అనే నిశినుంది జ్ఞానజ్యోతులు తిమిరాంతకాలు గ మారి సంతోషం సుఖ సుఖ్యాలను మన అందరికి ఇవ్వాలని ఆశిస్తూ ... కావ్యాంజలి వీక్షకులకు కవి ప్రేమికులకు నా తరపున వెయ్యి వెలుగులు ప్రసరింప చేసే దీపావళి శుభాభినందనలు. Wishing you all a Very Happy ,Bright and Safe Deepawali %%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%~* ((@))~* Sridhar Bukya

చలి తెరలు

Image
Image Courtesy: The Hindu చేతులు చల్లగా మారాయి .. చందురుడు నిషి రాత్రి లో మసకగా కనిపిస్తున్నాడు ఉదయం మంచు పల్లకి లో తేలియాడుతూ ఉంది ... కళ్ళకు కట్టినట్టు ఆ మేఘమాల నేడు పొగ మంచునే అచ్చాదానంగా చేసుకొని ఇల పై ఇలా వాలినట్టు ఎటు చూసిన పొగ మంచు తెరలు అల్లుకున్నాయి కమ్మని ఈ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ అలా చక్కర్లు కొడుతూ ఉంటె ఆ చలి లో చలి మంటలు వేసుకుని పోగేసుకున్న మనుషులు తరాస పడుతారు . వేకువలో కూడా చల్లగా చేసే శీతాకాలం ఇలా మనముందు ప్రత్యక్షం అవుతుంది ... చల్లని గిలిగింతలు పొగమంచుల కవ్వింతలు చలి మంటల పరిచయాలు ... నిద్రలేచిన మంచం దిగడానికి వీలు పడని  చలి తెరలు ... మంచులో ప్రయాణాలు ఆహ్లాదభరిత వాతావరణం లో చేసే విహార యాత్రలు మన అందరికి ఏంటో నచ్చే రోజులు ఇవే సుమండీ ...! చలి తెరలు ఋతు రాగాలు చల్లదనం లో వెచ్చదనం కోసం పడే పాట్లు హాయిగా మురిపెంగా వినోదంగా అనిపించే ఆ మధుర క్షణాలు ... చలి తో ఆత్మీయ అనురాగాలు ప్రక్రుతి తల్లి మనకు అందించిన అపురూప బహుమానం.

দূর্গা নাভারাত্রী পারভ

Image
মা দূর্গা দেবী সকল ভাক্তানি শুভ কারু মা দূর্গা নাভারাত্রী পারভ বাংলা হাবড়া কলকাতা অক্টোবর ২৪, ২০১২ যাই মা কালি ভাদ্রকালি শ্রীধর ভুক্য়া

Vasantam

ముత్యాల చినుకులు మోసుకొచ్చిన మేఘమా వెన్నెల వాసంతాలు విరబూయించిన వేకువ కొఇల గానాలతో అలరారిన వసంతమ చివురులను తాకి తాకనట్టుగా పరిమళాలు వెనువెంట మోసుకొచ్చిన చల్లని సాయంత్రమ

Ninna Nedu Repu

నిన్న ఓ కరిగిపోయిన కమ్మని కల నేడు ఓ చెదిరిపోని కర్తవ్యాల వల రేపు ఓ మధురనుభుతినిచ్చే వెల్లువ ఆ ప్రవాహం ఎప్పుడు మన ఎదుటికి రానే రాదు నిన్నటి ఆ స్వప్నాన్ని ఎన్నాలని గుర్తుచేసుకు ఉంటాము రేపటి మన ఆశలకి ఆశయాలకి నేడు ఓ పునాది అవ్వాలి నిన్నలో జరిగిన వన్ని మన మంచికని అనుకోని రేపటికి ముందు అడుగువేసుకు పోవడమే మానవ లక్షణం చిరునవ్వు చెదరని మోమును చూస్తూ ఉంటె మనసు ఉప్పొంగి ఉల్లాసంగా పరుగులు తీస్తూ ఉంటుంది అదే మన కళలను సాకారం చేసే విజయ వారధి మన రేపటికి మనతో ఎప్పటికి నిలిచి పోయే పెన్నిధి

దొంతెర

అల నేను నిదురించడానికి ఉపక్రమించానో లేదో.. ఉన్నటుండి ఏవో జ్ఞాపకాల దొంతెరాలు నా కనుల ఎదుట సాక్షాత్కరించాయి.. నిన్నటి ఆ రోజులు ... ఆ ముభావమైన స్వభావాలు ... భావం లేని రాగాలు ... రాగం లేని రాగ ద్వేషాలు ... ద్వేషం లేని కల్మషాలు... కల్మషం లేని ఆప్యాయతలు... ఆప్యాయత మరిచిన ప్రేమలు... అన్ని.. అల అల ... ఇన్నేళ్ళలో ఎప్పుడు అనిపించలేదు నాకెపుడు కాని తోలి సారిగా అప్పుడు ఎందుకు అనిపించిందో ... నాకైతే అసలు తెలియనే తెలియదు.. తెలిసి తెలియని వయసు లో మొదలయ్యేది ఒకటి ఉందని తెలిసిన ... ఆ భావన అదేనా కాదా అని మనసు లో సమస్య పూరణం చేసుకునే ఇప్పటి లాంటి రోజులు కావవి ... ఎప్పుడు లేనంతగా ఎందుకో నాకు అల అనిపించింది ... కాని చెప్పడానికి మాటలు చాలక ... విన్నవిన్చుకోవడానికి మనసు ఒప్పక అంతర్మథనం చేసుకున్న క్షణాలవి ... రోదసిని దాటి రోడించాలనిపించిన ఎందుకో నాకప్పుడు ఏమి అనిపించలేదు .... ఆ భావన కలిగి నేటికి పన్నెండేళ్ళు సంపూర్ణమైన ఇప్పటికి మొగ్గ తొడిగిన కలువ రేకుల్ల ... హొయలు పోతున్న జలపాతం ల .. ఆకాశాన మెరిసే తార ల మిణుక్కు మిణుక్కు మంటూ ఓ చల్లని దీపం ప్రజ్వలిస్తుంది. నా కంటికి ఆ ఉప్పెన కూడా మానవత్వం కలిగిన మనిష...

Raagaalu

ఎగిరే గాలిపటాలు మనసులోని ఆలోచనలు పూచే పువ్వులు మది లో దాగిన భావాలు నిషి రాత్రులు ఉదయించే రేపటికి స్వాగతం పలికే ఎర్ర తీవచిలు వెన్నెల కాంతులు కల్మషం లేని బంధానికి ప్రతీకలు వెచ్చని సూర్య రశ్మి ఆనందానికి ఆనవాళ్ళు పక్షుల కిలకిలలు రాబోయే మంచి రోజులకు నిలువెత్తు నిదర్శనాలు

Happy Vinayaka Chaviti

Image
Maha ganapatim Manasa Smaraami [*](.=.)[*] (#)( .jj, )(@) ( ) (  /.   ) ( ) ------------------- Om Gam Ganadhipataye Namah

Life

Image
Family is just like a pair of tracks with Joy and Gloom running in parallel all through our journey, Emotions are like fish plates that keep balance of the Joy and Gloom so that they cannot mess up. Even if one of the tracks is missing, the Train called Life gets de-railed. Relationships are the track pins that hold the Emotions and Joy and Gloom together. Gravel shows the relationship between siblings, they should always be harsh to others criticizing them but should support the whole Family. Parents are supporting Electric Tractions, who direct us towards our destination by their power of will.

తపన

రోజు అలానే తెల్లవారుతూ ఉంది అలానే చీకటి పడుతూ ఉంది ... ఈ రేయి చీకటికి ఆ పగటి వెలుగుకి ఎంతో  వ్యత్యాసా ఉంది కాని ఆ వెలుగు కి ఈ చీకటికి మధ్యన ఏదో చెయ్యాలని తపన హాయికలిగితే నవ్వగలిగే మనస్తత్వం ఉంది బాధగా ఉన్నపుడు ఎవరికైనా చెప్పి సాంత్వన పొందే అవకాశం ఉంది .. ఈ ఇరు భావాల మధ్య సగటుగా ఉత్సాహంగా ఉండాలని ఏదో తపన ఈ జీవితం మనల్ని వెతుక్కుంటూ రాదు మనకి దేవుడు ప్రసాదించే ఊ అవకాశం ఓ వరం నిరుత్సాహానికి ఉత్సాహానికి మధ్య  ఏమైనా ఉన్న మన మనసులో మెదిలే భావాల కలయికే సుమీ నిట్టూర్పులు ఉన్న ఆహ్లాదంగా ఉండాలన్న భావనే మనిషిని మనిషిగా గుర్తిమ్పునిస్తుంది అల ఉప్పెన లో ఉన్న తపన కొద్ది ఒడ్డుకి వస్తు ఉంటుంది మన మనసుకూడా అపుడప్పుడు తడబాట్లను తట్టుకో గాలిగే ఓ ఆశల కడలి లా పెను సంద్రం ల మారాలి అలా మారితేనే జీవికి జీవించాలనే తపన యద నుండి పొంగుకు వస్తుంది  మన చుట్టూ ఉన్న ఈ లోకం మన మీద నిందలు వేసిన వాటిని భరించే శక్తి ఆ దేవుడు మనందరికీ ఇస్తాడు ... సరైన సమయం లో అది వాడుకుంటే ఈ లోకాన్ని జయించినంత సంతోషం మనకు కలుగుతుంది అదే జీవిగా ఓ మనిషిగా మనం అందవేసే ఓ చిరు స్వప్నం. ఆ చిరుస్వప్నాన్న...

నిరీక్షణ

రెప్పపాటు కాలం చాలు మంచిని చెడు అనుకోవడానికి క్షణికావేశం చాలు నిలువెత్తు మనిషిని జీవం లేని బొమ్మల మార్చడానికి  కల్మషాలు నిట్టూర్పులే మనిషిని బెదర గోడుతున్నై .. అదే రెప్పపాటు కాలం లో మంచని మంచి అని గుర్తించే వారే అరుదుగా లభిస్తున్నారు ఈ కాలం లో ఆప్యాయతలు కనుమరుగై కోపాలు గొడవల ధాటి కి ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న బొమ్మరిల్లు నేడు పునాదులు కూడా కదిలిపోయి శితిలవస్థ లో ఉన్న కుటుంబాలు నేటి కాలం లో ఎన్నో ఎన్నెన్నో .. మనషుల మధ్య సానిహిత్యం భావాల మధ్య సారుప్యత ఈ కాలం లో ఎడారి లో ఎండా మావులే వెండి వెన్నెల ని ఆస్వాదించే కాలం ఎప్పుడో కాలగర్భం లో కలిసి పోయింది ... మనశులమైతే ఉన్నాం కాని మనలోని మానవత్వం ఎప్పుడో కాని బయట పడదు ... ! మనషుల మధ్య ఆదరణ పోయి ఘర్షణల అఘాధం ఉంది .. సుమాల వాడు లో నేడు కుసుమాలకి బదులు మురికి నీరు ప్రవహిస్తున్నట్టుగా గబ్బుగా తయారయ్యింది నేటి సమాజం. ఇవన్ని మారిపోయి మనషుల మధ్య సంధి కుదిరి అందరిలో మమేకమై ఆనందాలు పంచుకునే రోజు కూడా వస్తుంది ... అది ఏంటో దూరం లో లేదు... ఇక నిరిక్షనే చెయ్యాలి మనం.  Disclaimer: This poem does not pin point any person or anyone in ...

సంద్రం

ఎడారి లేక  పోతే నీటి విలువ తెలియదు ఎవరికీ సంద్రం ఉనికిని మరిచిపోయేది ఎవరు కెరటాల సంగీతాన్ని రేయింబవళ్ళు అందిస్తుంది అది ఆ మహా ఘోష లో ఏదో తెలియని ఆర్ద్రత ఎదురవ్వుతుంది ఎంత లోతుగున్న సరే ఎక్కడో తన యదలో దాచిన  ముత్యం  ఆల్చిప్ప లో  దాగిన ఆణిముత్యం ల తన మీద సూర్యుని కాంతికి మిలమిల మెరుపులు ఎన్నో రేట్లతో ధగధగ లాడుతూ ఉంటుంది

Alaa ... Alaa

చిరు చినుకులు కురిసి మది నిండా పులకింత ఏరై పారే లా ఉవ్వెత్తున ఎగసే నీలి సంద్రాన్ని తలపించే లా మెరుపై  అల్లంత దూరం లో మెరిసిన ఆ 'నీల వేణి ' ఆకాశం లో పరవళ్ళు తొక్కే ఆకాశ గంగను తలపించే లా  చిరు చిరు గాలుల ఉనికికి పాదాభివందనం చేస్తున్న కొమ్మలు రెమ్మలు ఋషులు మునులను తలపించే లా ఓ చల్లని వేళ సేదతీరాలని అలా నడుచుకుంటూ వస్తు ఉంటె ఆ గాలి నన్ను తాకుకుంటూ దాటి పోయింది అలా

Vennela Vaana

విరిసే పువ్వుల్లో కురిసే  వానల్లో తేలియాడే  మనసు  నిట్టుర్పుల వలయం జీవితాన్ని కొత్త కోణం లో ఆవిష్కృతం చేస్తుంది తెలియని బంధాల్ని మన  చేర వేస్తుంది నీరు ఇక్కడిదే ఐన వాన చినుకులు ఇక్కడివే ఐన వాటిని మోసుకుని వచ్చే మేఘాలు అనంతాకాశానివి అలరారుతున్న అందాల కొలను లో కలువ పువ్వు వికసిస్తే ఆస్వాదించే వారు   ఆదమరిచి నిదురలో జారుకుంటారు వెన్నెల అందాలు రేయిని వెయ్యి   రెట్లు ఎక్కువ అందం గ తీర్చిదిద్దిన ఆ భావుకతను అర్ధం చేసుకునే వారు ఎవరో కోటి కి ఒక్కరు

Voyage

Image
Photo Courtesy: Blogger Template This life is a journey along the deserts of sorrows and happiness in equilibrium We don't know when we have started our journey of life, but in the midst of youth we discover that we are travelling in this voyage , a tour of life. We meet many people accidentally or incidentally, some may befriend, some may not, some hate us, some love us, some want to continue this journey along us. The road may seem long and the distance may make you feel sick, but remember life in real time has no intervals, no breaks, no look backs and the life player has no replay button. All we have with us is hope and enthusiasm. You may take a wrong bus or a wrong train, but never try to leave intermittently while you are aboard or never miss the thrill of this awesome yet awful, beautiful yet worse, good yet bad, once in a lifetime journey.

Ankitam

నా మనసుని దోచింది ఒకనాడు ఈ మంచి మనిషి నేడు నా మనసులో చెరగని స్నేహపు ముద్ర వేసిన ఈ నా తోలి నిచ్చెలి కి ఈ అలలతీరం అంకితం చేస్తూ... నా కావ్యాలన్నిటికి ప్రాణం పోసిన దేవత. నా జీవితం లో ఎ నాటికి మరవని ఓ తియ్యని ఓ మలపు నా ఈ జీవితం లో ఏ నాటికైనా  గుర్తుండిపోయే  ఓ స్నేహ కావ్యమా నా దారిని మార్చిన ఓ ప్రియమార నీకే అంకితం ఇస్తున్నాను నేను ఈ కావ్య మాలికను

సహనం

విరిసే పువ్వు వీచే గాలికి పరవశించి పోతుంది వెలిగే దివ్వె జ్యోతిని ప్రజ్వలింప చేస్తుంది నడిచే దారి కాన రాక ఎటో పయనిస్తున్న బాటసారికి ఓ వెలుగు తన గమ్యం వైపుకు మళ్ళిస్తుంది ఆకాశం ఎత్తుగా ఉన్న అందులోని నక్షత్రాలు ఎలా మనవైపు వెలుగును పంచుతుందో అలాగే మనం కూడా ఎదిగిన కొద్ది మనల్ని ఇంట స్థాయికి తెచ్చిన మన తల్లిదండ్రులకు  ఎప్పటికి ఒదిగి ఉండాలి ఈ వెన్నెల వెలుగులు ఈ తిమిర సమీరాలు రేపటి ఉదయం వరకే .. ఆ ఉదయం కొత్త శక్తిని బలోపేతం చేస్తూ కష్టాల కడలిని దాటించి వేస్తుంది అదిగో మనం అనుకున్న దివి అలలమాటున దాగి ఉంది వెతికి అక్కడికి చేరుకుంటే ఆ గుప్త నిధి మన మేధో శక్తీ మనల్ని ఎంతో ఎతుకు చేరవేస్తుంది మన గమ్యం ఎంతో దూరం లేదు రండి లేచి అటు వైపుగా అడుగులు వేద్దాం ... ఓ మహోన్నతమైన ఆంధ్రావని ని కళల భారతావనిని రుపుదిద్దుకుందాం

Aatmeeyata

తళ్ళుక్కు మనే తారలు పొదిగిన ఆకాశం చూడాలంటే నీలాల నింగి కి రంగులు అద్దాలి వేవేల తీరాల దూరం వెళ్ళాలన్న నిలకడగా సాగిపోవాలి వేణు గానం వినాలన్న మురళిలో గాలి ఊపిరి భావం తో ఎగసి పడాలి ఈ కవిత్వం నిండు భావం తెలియలన్న భావుకతతో మనసు లీనమై రాగ ద్వేషాలకు తావివ్వకుండా కలిసిమెలిసి పోవాలి అదే ఆత్నీయత భావం అదే అన్నిటికన్నా మనషులకు తెలిసిన కనక సోపానం రెక్కలు లేని మనిషికి ఆశయాలున్డాలి పైకేదగాలనే తపన ధ్యాస ఉండాలి మాటలు నేర్చిన మనిషికి మనసును అర్ధం చేసుకునే భాష రావాలి

Anuraagaalu

జీవితం ఒక్కటే... బంధాలు ఎన్నో భావోద్వేగాలు మరెన్నో జీవితం ఒక్కటే ... రాగ ద్వేషాలు ఎన్నో సరాగాలు మరెన్నో జీవితం ఒక్కటే... భావాలెన్నో కావ్య మాలికలు మరెన్నో జీవితం ఒక్కటే... భావం ఒక్కటే నీలాకాశం ఒక్కటే భావుకత కలబోసినా కావ్యాంజలి భావంవేషణ లో ఎప్పుడు సుడులు తిరిగే ఆలోచనల సరళిలో తేలియాడే మనసు జీవితం ఒక్కటే కాని అది నేర్పే బోధ జన్మంతా గుర్తుండిపోయే ఓ పాఠం

సంక్రాంతి శుభాభినందనలు

తియ్యని చెరుకు గడ లా మన జీవితం తియ్యగా సాగి పోవాలని ఎ కల్మషం లేని స్వచ్చమైన ప్రేమ మన యద లో ఉప్పొంగాలని పంచ భక్ష్య పరమాన్నాల సమానంగా సుభిక్షంగా ఉండాలని ఎలాంటి భేదాభిప్రాయలైన కాలి సమాభిప్రాయలు గా మారిపోవాలని ముంగిట్లో వేసే రంగావల్లికల్ల మన జీవితాలు సుఖ సంతోషాలతో కళకళ లాడాలని నింగి లో ఎ ఆటంకం లేకుండా ఎగిరే గాలి పటాలై మన కీర్తి అంచెలు దాటాలని ఈ పెద్ద పండుగ మన అందరిలో స్ఫూర్తి ని సమ భావాన్ని రేకేతిచాలని మకర సంక్రమణం లాగ దుర్బుద్ధి నుండి సుబుద్ధి కి తామసం నుండి వెలుగు లోకి రావాలని మనసార కోరుకుంటూ కావ్యాంజలి ని వీక్షించే వారికి మరియు అందరికి ఈ సంక్రాంతి శుభాభినందనలు మీ శ్రీధర్ భూక్యా