ప్రకృతి సోయగాలు
Image Courtesy: Patrice Sery (Picasa) Image Courtesy: Kelly De Lay (Picasa) పూల పరిమళాలు తన వెంట తెచ్చే ఆమనిని ఆస్వాదించాలంటే ఉన్న సమయం చాల తక్కువ చిటపట చినుకుల అందేలా రవళి తో తన్మయత్వం తెచ్చే వర్ష కాలానికి వ్యవధి తక్కువ లేలేత కుసుమాలు వన్నెల రామ చిలకలు చిన్నారి చిందులు చూడాలంటే మక్కువ ఎడారి లో వర్షం పడితే వింత. భావం అర్దమయ్యేది మేధాకైతే స్పందన హృదయం లో తెలుస్తుంది హృదయానికి తెలిసిన వెంటనే ఏ సంబంధం లేని కన్నులనుండి దారాలు గా కన్నీరు రాలుతుంది మనసుని ఆహ్లాదపరిచే ఆమని కి నిడివి తక్కువ ఐన చూసే కన్నులకు పండుగ అవుతుంది రెక్కల సీత కోక చిలుక తన వెంట ఆకాశం లో రంగుల్ని పోగేసి చీర చుట్టుకున్నట్టు వెన్నెల అందాలు కంటికే కలత తెచ్చి పెట్టె చీకటికే పరిమితమై సొంతమైనట్టు గాలికి తనతో పాటు రెక్కలు తొడిగి కొత్త ప్రదేశాలకు వెళ్లినట్టు మనసు మమత ఆప్యాయత రంగరించి రంగుల హరివిల్లు ఆకాశ వీధిలో ప్రకాశిస్తుంది వెండి వెన్నెల మాటున నిండు జాబిలీ మబ్బులతో దాగుడు మూతలు ఆడుతుంది వేల చుక్కల సాక్షిగా...