Posts

ఏదో రాయాలనిపించి...

Image
ఇమేజ్ కర్టసీ: వర్త్ 1000. కామ్ ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  మనసు ఆనంద డోలికలు ఊగుతూ ఉంటె  తనతో పాటు ఏదో అందాల లోకం లో విహరింపజేస్తుంటే  అక్షరాలన్నీ భావాల సుడిగుండంలో చిక్కి చెల్లాచెదురైపొయాయి  ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  ఏవో తియ్యని జ్ఞాపకాలు కళ్ళముందు కదులుతుంటే  ఆ తెరచాటు భావాలేవో బయిటికి ఉబికివస్తుంటే  అక్షరాల్లని ఆ ఊబిలో చిక్కుకుని సుడులు తిరిగి కనుమరుగయ్యాయి ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  ఎన్నోరోజులుగా అనుకుంటున్నా ఆ ఆత్మీయ స్పర్శ ఏదో నన్ను తాకింది  ఎవరని వెనక తిరిగి చూసా భయం తో, అక్కడ ఎవరు లేరు నా నీడ తప్ప  ఆ నీడలో నా నిన్నని చూసి బాధతో  నీరుగారి ఎండిపోయాయి ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  మదిలో భావాలను ఎకరూపు పెట్టాను  తన పంతం నేగ్గించుకుని ఠీవిగా నిటారుగా నిలబడిన ప్రేమ నన్ను అర్హత అడిగింది  ఇన్నేళ్ళు నిన్ను నేను నా మదిలోనే దాచిన సంగతి చెప్పాను మనసుని అర్ధం చేసుకోలేని ఫీలింగ్ ను నీకు పరిచయం చేసింది నేనేనా అని తలవాల్చి అదృశ్యమయింది  ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  భావాల కొలను లో చెదవేసి ప్రేమను తోడాలని ప్రయత్నించాను  సగం దూరం దాక లాగిన తరువాత బరువెక్కిన గ

వీటికి సమాధానం నీకే తెలియాలి

అందరికి అంది అందకుండే ఓ ప్రేమ నీకు కొన్ని ప్రశ్నలమ్మ! ఒంటరి జీవితం లో తుంటరి తలపులు తెప్పిస్తావు ఎందుకమ్మ? తీరా కలసినాక మొగమాటం బిడియం అంటూ సాకులు ఎందుకమ్మ? ఏకాకిగా ఎవరిని ఉండనీవు కాదమ్మా మరి నీకా శక్తి ఇచ్చింది ఎవరమ్మ? రెప్పల కంటిపాపకు కాంతినే కాదు మనసు అద్దం లో భావాలు చూడడం నేర్పింది నీవేకదమ్మ? మనసులో ఎప్పుడు వచ్చి చేరిపోతావో అది మాత్రం ఎవరికీ తెలుసమ్మ? నువ్వు ఉన్నవని కనిపెట్టే లోపలే కనుమరుగై పోతావు ఇదేమి చిత్రమమ్మ ? మనషులు పలికే భాసలో అలకలు కులుకులు తెప్పిస్తావు ఏలనమ్మ ? అన్ని తెలిసి ఇట్లా వేధించడం అది నీకే తగును ఎలా ఓయమ్మ? నువ్వు చేరిన క్షణం నుండి నీపైనే ధ్యాస ఎందుకో తెలిదమ్మ ? ఇలా నన్ను నీలో నిన్ను నాలో చూసుకోవడమే ప్రేమెనేటమ్మ ? మారు మాటలాడక సమాధానాలు చెప్పవే ఓ ప్రేమ అలక నీకు తగదు గాక తగదు !!  

కాలం మారింది

కమ్మని కల ఏదో కనులను మెలకువలోకి తీసుకొస్తుంది తీర కళ్ళు తెరిచాక ఏముంది ఆనందమంతా ఎగిరి పోతుంది  పువ్వులను చూస్తె మనసు ఉప్పొంగి పోతోంది  వన్నె తరగని అందానికి క్షణకాలమే పాశం అవ్వి మరో క్షణం లో వాడి పోతుంది  మనసులో నిన్ను తలచిన వెంటనే ఎగిరి గెంతాలనిపిస్తుంది నిరుడు నన్ను వెంటాడిన ఆ నీడని తరమాలనిపిస్తుంది  తేరిపార పరికించి చూస్తె నువ్వు లేవు నీ ప్రేమ  లేదు భూమి కృంగి పోతుందన్న ఫీలింగ్ ఒకటి  మనసు నిన్ను మరిచిపోవాలని పాటలు వింటూ ఉంటె  "ప్రేమ ఎంత మధురం .. అని అభినందన నుండి ఓ రాగం  కరిగే దాక ఈ క్షణం గడిపేయాలి .. అని ఆర్య నుండి   నమ్మక తప్పని నిజమైన.. అని బొమ్మరిల్లు నుండి " ఇలా ఒకటి వెనకాల ఒకటి ఏడుపు గీతాలే ... విరహ గీతాలే కాని ఏదో తెలియని ఆర్ద్రత నిండిన మనసు తేలిక పడ్డట్టు అనిపిస్తుంది  ఏమో ఇది ..  నీతో ప్రేమలో ఉన్నపుడు అన్ని హుషారు గొలిపిన పాటలే  "ఎల్లువచ్చి గొదారమ్మ.. నుండి నిన్నటి  మై హార్ట్ ఇస్ బీటింగ్ .. నుండి నేటి నిన్ను చూడగానే ..." వరకు  ఇప్పుడెక్కడ ఉన్నాయవి నీతో పాటుగా కనుమరుగయ్యాయి మాయ అంతర్జాలం లో ఏమ్మున్నవి చెప్పుకోదగ్గ

నీకోసమని తిరిగి వస్తాను

నీ కోసమని వేచి ఉన్న కన్నుల్లో కలలు కరిగి కన్నీరుగా మారి నిను చేర పయనం అయ్యాయి ఏలా నీకి అభియోగం బాల, విననంటివా నా గోల  చీకటిని చీల్చి సూర్యోదయం అయినట్టు, ఏదో ఒకరోజు నీకోసమని తిరిగి వస్తాను, నీ గాయపడ్డ మనసును అర్ధం చేసుకోవడానికైనా  ఏదో ఒక రోజు నీకోసమని వస్తాను.  ఎన్నడు నీపై నా ప్రేమను నిత్యనూతనంగా ఉంచుతానని మనవి చేస్తూ

तस्वीर

छोड़ कर गए नहीं हम कहीं देखना था प्यार कितना है बस अब देख लिया अब रहा नहीं गया दौड़ के आगये हम देखो वापस उस प्यार के वास्ते किनारा था पास में लेकिन नाव निकल पड़ी कहे बिन हम जाते तो कहाँ तुम्हारी ही यादों में खोये खोये से हर बार एक ही बात तुम्हारी मेरे कानों में गूँज उठती "मुझे छोड़ कर ना जाना ओ हमसफ़र, एक न एक दिन जरूर आया करोगे मेरे यहाँ" आज वो बात सच निकली और लो मैं चला आया वापस तेरे पास तेरे प्यार की ही नाव में सोचता था यूंही कैसे गुजरे मेरे दिन तेरे बिन सूरज उठता था चाँद ढलता था बस कटा एक दिन आज तक किसीने तुम्हारी तरह मुझे घेरा नहीं तेरे प्यार की कोई जादू जो तुमने चला दी ढूँढता हुआ निकल पडा हूँ तेरे लिए तस्वीर एक मन के भीतर 

Terrafugia TF-X

Image
TERRAFUGIA TF-X We have seen many terrestrial vehicles that have played a pivotal role in transporting us from one place to another place. Our dreams to fly got fulfilled with the Invention of Airplanes, but even then there was a void in the transport segment. Given the limitations of a terrestrial vehicle to cover large distances with precision and safety was not answered until 2009, when a team of graduates from Massachusetts Institute of Technology invented a new technology in the personal transportation sector. And that very invention called up a standing ovation. It was a transformable/convertible plane-car that can be owned, given that you pass the Test Pilot Licensing Examination. The first Ave-Car was the Transition. The TF-X can fit in a regular car shed/garage Given to the complex systems inside the Transition, a new Hybrid Ave-Car known as TERRAFUGIA TF-X has been developed. The whole vehicle is Electric powered

రక్షాబంధనం

Image
అన్న చెల్లెళ్ళ అనురాగానికి ప్రతీకగా  అనునిత్యం ఒకరికి ఒకరు ఆలంబనగా  దేవుడిచ్చిన ఓ కమ్మని వరం నీవమ్మ  ఈ రక్షా బంధం మన బంధాన్ని ఇంకా గట్టిపరచాలని  నీ ఆశలు ఆశయాలన్ని నెరవేరాలని ఓ అన్నగా దీవిస్తూ  ఈ రాఖి పండగ నాడు ప్రతి అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు సుఖసంతోషాలతో మెలగాలని అందరి ఇంట సిరులు పండాలని కోరుకుంటూ  ఓ కృష్ణునికి సుభద్ర లా, మన మధ్య ఈ వాత్సల్యాలు ఎన్నటికి చెరిగిపోదని ఆసిస్తూ ఆశీర్వదిస్తూ  మీ అందరి మేలు కోరే అన్నగా కోరుకుంటూ రక్షాబంధన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను మీ ఆదరాభిమానాలను ఓ సూత్రంగా మలచి మణికట్టుకు కట్టే ప్రతి చెల్లి కంట ఆనందాన్ని అవుతానని కోరుతూ

శ్రీమన్నారాయణ పదకమలార్చన

Image
Image Courtesy: Google రాగం: భూపాలరాగం తాళం: ఆదీతాళం శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ పాదమే శరణు కమలసతీ ముఖకమల, కమలహిత కమలప్రియ కమలెక్షణ కమలాసన హిత, గరుడగమన శ్రీ కమలనాభ, నీ పదకమలమే శరణు పరమయోగి జనభాగ్యదేయ శ్రీ పరమపురుషా, పరాత్పర పరమాత్మ పరమాణురూప శ్రీతిరువేంకటగిరి దేవా శరణు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి రచన సౌరభం  

రాగ విపంచి

చెల్లాచెదురైన కలలను సైతం ఏర్చి కూర్చి ఇన్నేళ్ళు కూడగట్టిన ప్రేమను ప్రేమలేని /ప్రేమ తెలియని మనిషికి పంచి ప్రతి గుండె సవ్వడి లో వినిపించే లయగతులు నీవేనని తెలిసి కరుడుగట్టిన నీ హృదయ పాషాణం కరగకున్న వలచి  తెలిసి తెలిసి నా అమాయకత్వాన్ని నువ్వు తూలనాడిన భరించాను భూమిలా ఓర్పు నేర్పు తో నిన్నే నేనేని తలచి  ఇక ఈ కఠోర పదజాలం  తో నిన్ను నాకు దూరం చెయ్యాలని కాదు నా మనసులో ఉన్న నీ ప్రేమను తేరిపార పరికించి నా మనసు కోవెలలో నిన్ను పూజించా, వరమియ్యక ఇలా నా మనసుని ఎల్లవేళలా నీ మాటలతో గాయపరిచి వెళ్తే వెళ్ళేవు నా మనసు నుండి కాని ఎదురు చూసే కళ్ళల్లో కన్నీరు బదులుగా నీ కలలనే కల్లలు చేసావు నా మాటను వక్రీకరించి  మిగిలావు నువ్వు ఇక నా మనసు మందిరాన ఓ తీపి గురుతుగా మనమేలే ఈ అమూల్య ప్రేమపు రాగ విపంచి వెన్నెల కిరణాలలో నీ చల్లని మోము చంద్ర బింబమై కదలాడే నా కన్నుల్లో భావాలు కొలిచి  వన్నె తరగని వేళా మనసు మందిరం లో ఏదో తెలియని అలజడి నీవని తెలియక మధన పడ్డ  వ్యాకులతకు నువ్వు చిరునామా కావద్దన్నాను నా ప్రేమను తిరస్కరించి వెళ్ళినావు తస్కరించి 

తరగని ప్రేమ

Image
ఇమేజ్ కర్టసీ వర్త్ 1000 ఊపిరి బిగపట్టి ఉండగలనా అనిపించింది  అదే తడవుగా ఐదు నిమిషాలు బిగపట్టి ఉన్న  ప్రాణం అంత విలవిలా లాడింది  ప్రాణం విలువ ఏమిటో తెలిసొచ్చింది  నీతో స్నేహం చెయ్యాలని చెయ్యి చాచాను ససేమిరా అన్నావు ఎక్కడో తాకింది  నిన్ను నాకు దూరంగా కొన్ని నెలలు ఉందామనుకున్నాను  కాని ఏళ్ళు తరబడి నీ ఊహలు నన్ను అట్టే కట్టి పడేశాయి  ఇన్నాళ్ళ మన పరిచయాన్ని పరిచయమే అనుకున్న  ఇది ఓ వీడని బంధం అని నీకు దూరం ఐన కాని నాకు తెలిసిరాలేదు  మన ఆ బంధానికి స్నేహం అని నిర్వచించాను నేను  నన్నొదిలి నువ్వు వెళ్ళాక అర్ధం అయ్యింది అది స్నేహం కాదు ప్రేమ అని

ఓ తియ్యని అనుభుతి

ముత్యాలాంటి కన్నుల్లొ కన్నీరె కాదు, కలలు ఉంటాయని తెలిపింది నువ్వే భావలే తప్ప పలుకులు నేర్వని హృదయానికి స్పందన ఓర్పు నెర్పింది నువ్వే రాగద్వెషాల నడుమ ఆప్యాయత అనురాగం ఉంటుందని చాటింది నువ్వే ఇలా నన్ను ఇంతలా మలచి, ఆపై వలచి, మెల్లగ నా మదిలో నిలిచింది నువ్వే ఇంతకంటే చెప్పలెనెమీ ఓ నా ప్రాణ ప్రణయ సఖియా, ఇలా నన్ను మార్చింది నువ్వే

నా గుండె ఏనాడో పగిలింది

Image
ఇమేజ్ కర్టసీ: వర్త్ 1000 నా గుండె ఏనాడో పగిలింది  అందులోని నా ప్రేమ ఇంకా పారుతూనే ఉంది  నా గుండె ఏనాడో పగిలింది  అతికించినా అతకనంతగా ముక్కలు ముక్కలుగా  నా గుండె ఏనాడో పగిలింది  బహుశా నీ గుండె చప్పుడు విని బ్రతికున్ననేమో అనిపిస్తుంది  నా గుండె ఏనాడో పగిలింది  పగిలిన ముక్కల్ని ఏరుతున్నాను , అన్ని ముక్కల్లో నీ జ్ఞాపకాల వీచికలే  నా గుండె ఏనాడో పగిలింది  సైబోర్గ్ గుండెలో భావాలు ఎన్ని నింపినా స్పందన లేకుంది నా గుండె ఏనాడో పగిలింది కన్నీటి సంద్రమే నా కళ్ళముందు కదలాడింది నా గుండె ఏనాడో పగిలింది  స్వచ్చమైన నీ ప్రేమ పొందలేక విలవిల్లాడిపోయింది  నా గుండె ఏనాడో పగిలింది  వెన్నెల రేయి కూడా ఎర్రని ఎండగా మారిపోయింది  నా గుండె ఏనాడో పగిలింది   ఓ రోజా మొక్క అందునుండి ప్రాణం పోసుకుంది   బహుశా అదే మన ప్రేమపు చివరి చిహ్నమో ఏమో

ఇదో బాధాకరమైన కావ్యం

Image
Image Courtesy: Worth 1000 అక్షరాలను పేర్చి ఓ కవితగా మలచాననుకున్న  కాని ఆ కవితే అక్షరాలై ఉరకలు తీసాయి ఏమిటో ఈ విచిత్రం మాటలు ఏవో చెప్పాలని ఆత్రుతగా వచ్చాను  కాని ఆ మాటలు పెదవిని దాటలేదు ఏమిటో ఈ విచిత్రం మనషులం కదా అందరు కలిసి మెలిసె ఉంటారనుకున్నా  కాని మనిషి మనిషికి ఇంత వ్యత్యాసా ఏమిటో కన్నులు దాటి కన్నీరు ఎరయ్యి పారుతూ ఉంది  కాని నా మనసుకు సాంత్వన ఇచ్చే వారే లేరే ఏమిటో స్నేహానికి ప్రేమకి ముడి పెట్టి స్నేహాన్ని ప్రేమ అన్న సమాజం మనిషిలోని మంచితనాన్ని ఒర్వకుండా కుళ్ళుకుంటారు ఎందుకనో ? స్థితిగతుల పుణ్యమా ఇది మంచితనం చేసుకున్న పాపమా ? చెప్పే మాటలు తూటాల్ల గుండెను గాయ పరుస్తున్న నిలబడి పోరాడాలని మనసు అనుకున్న నిలవనేలా ? చెప్పే ధైర్యం లేక ఎవరో అనామకుడు బాణాలు సంధిస్తే అది గురి తప్పి నన్నే వెంబడి శూలంలా వెంటాడితే ఎలా ?

A Fine Morning

Image
Image Courtesy: Google Plus Images The Early morning showers has brought up a new world in front of us With little daisies blossoming all around, the nature has gifted it to us Light breeze, a little drizzle and chill Makes the heart throb pound and thrill Is there any other world like Earth Let us all feel her nature's Warmth

ఏ వైపు పయనిస్తున్నవమ్మ భావి భారతమా

న్యాయ దేవతకే గంతలు కట్టి దేశాన్ని దోచుకుంటున్నా   మానవత విలువలు కళ్ళముందే బుగ్గిపాలవుతున్నా ఆవేదన నిండిన మనసుతో ఏ వైపు పయనిస్తున్నవమ్మ భావి భారతమా కష్టాల కడలిలో  సుడులు తిరుగు కానరాని దుక్ఖఃమేదో జనాలు పడుతూన్నా కర్కశకఠోరక్షణికావేశాలు మానవీయ విలువలను దెబ్బతీస్తున్నా బాదతాప్త హృదయం తో ఏ  వైపు పయనిస్తున్నవమ్మ భావి భారతమా మంచితనాన్ని పునాదులుగా చేసి నిర్మించుకున్న ఆవాసానికి బీటలువారుతున్నా అరాచకాలను ఒక్కొక్కరై ఆపలేక అందరితో కలివిడిగా అన్యాయాన్ని పోరాడలేక చిన్నబోయిన మోముతో రగిలే గుండెతో ఏ  వైపు పయనిస్తున్నవమ్మ భావి భారతమా  (స్వాతంత్ర్యం వచ్చి నేటికి అరవై ఆరేళ్ళు దాటినా సందర్భం లో నేటి సమాజానికి దర్పణం పడుతూ రాసిన కవనం ఇది. ఇందులో ఎవరిని ఎలాంటి కఠోర పదజాలం తో దూషించలేదని మనవి చేసుకుంటున్నాను)

Nature's Bounty and Beauty

Image
వన్నె తరగని ప్రకృతి అందాలు తెలతెలవారే పొద్దుల్లో మంచుతెరలు రారమ్మని ఆహ్వానిస్తూ పలకరింపులు గులాబి బాల పులకరింపులు ప్రకృతి ఒడిలో జాలువారే వర్ణాలు అతి రమణీయం ఈ ఛాయాచిత్రాలు వినీల ఆకాశం నుండి జాలువారిన అందమైన భావన హరిత వనం లో వికసించిన ఓ అందాల గులాబి బాల ఇంతటి అందానికి కొన్ని ఘడియలే అంటే నమ్మబుధ్ధి కాదు ఈ మంచుతెరలు కమ్ముకుంటే హుషారు రెట్టింపవుతుంది విరిగి సూర్యుడు ఉదయిస్తే  తెల్లబోతుంది ఓ కొత్త ప్రపంచాన్ని మనకు అందిస్తుంది 

వందే జగన్నాథ

Image
ఓం ధరణి హర్షిత సమేత శ్రీహర్యయి నమః  వందే  జగన్నాథ  వందే  ముకుంద వందే  విష్ణో  వందే  కమలప్రియ గోవింద  నీ కడు చూపూల కరుణరసము కురిసేనీనాడు వెలిగేను చూడు జ్ఞాన దీపాలు నిను తలవంగ నేడు ఓ వేంకటేశా! నీ లీలామృతము ఆనందదాయకము అసమాన భక్తిభావాలనినుమడింప జెసే ముక్తిప్రదాయకము నా మదిలో కొలువుదీరితివి నిత్యం నిను కొలువంగ అనంతకొటీ సుర్యతేజములు నీయందు ప్రజ్వలింపంగ రామవతారంబున మనుజరూపాన వెలసి రామరాజ్యపాలన లో ధరణిని తరింపజెశావు కృష్ణావతారముయందు మురళిగానముజేసి నిఖిల జగత్తునె వెలిగించె గీతొపదెశము చెశావు వేంకటేశావతారములొ ఆడిన మాటను మరువనివాడివై శ్రినివాసునిగా వకుళమ్మ చెంతకు చెరావు భక్తకొటీ నీరాజనాలు అందుకుని వెలసినావు తిరుమల శిఖరాగ్రాన లొకేశ్వరేశ్వరా ఉన్ముక్తమనస్కుడవై లోకంబెల్ల నిను కీర్తింపగ భాసిల్లినావు కలియుగ ప్రత్యక్ష దైవమై శొభిల్లినావు తిరువీదులనూరేగుతు దేవేరులతోడా మమ్మానందింపగ వెలసిన ఆదికేశవుడా!! గొవర్ధనోధ్ధారి గోపాలా కాళియమర్దన గొపీజన ప్రియబాంధవ యదునందన నీ దివ్య మంగళ స్వరూపమునుజూడ శతసహస్రక్షాలు ఏ పాటి ఓ లోకలోకేశ్వర!! నీకు పదునాలుగు భువనభాండ

Types of Aircraft Engines and Working Principle Part 2 of 2

Image
Aviation Turbine Engines are manufactured by various companies that include Rolls Royce and GE. Given below are some of the pictures of Turboprop Engine and Turbojet based Turbofan Engines manufactured by GE and Honda Collective. All Images in this post are from the GE Aviation Turbine Engine Handbook Datasheet . Image Courtesy: (GE) General Electric Company. GE H80 Turboprop Engine. (These Engines are not used in India.) GE HF120 GE Honda Collective Turbojet Engine. The Turboprop Engine which is ready to be assembled Image Courtesy: GE The Plane that uses Turboprop Engine (Air Dolomiti) The Turbojet Engine that is ready to be assembled Image Courtesy: GE The Plane that uses Turbojet Engine. (Note the placement of the turbine: This is one another configuration) Previously, I have thrown light on Gas Turbine Engines, I now bring fore, some topics related to Helicopter Engine and it's anatomy: A Helicopter is also an aviation medium, but is a rotor cr

Types of Aircraft Engines and Working Principle Part 1 of 2

Image
We all generally know about the Aeroplanes in our day-to-day life. Have you ever thought, what is the main principle behind these Iron birds? It is the turbines that play a pivotal role in creating a viscosity in the Air (since Air is a fluid, it tends to flow from High pressure to Low pressure). Air is sucked into the compression chamber via the fan, the air is then compressed with a series of compressors, mainly 6-10 stages of rotor blades along with stator are utilised to compress the air; when the compressed air flows through the inner chambers, it gets through the Combustion Chambers. It is here where the ATF or the Aviation Turbine Fuel takes part. The ATF is ignited to generate a cloud of gases, which mix with the compressed air, and the mixture now expands, which is then allowed to pass through the low pressure turbines. The difference in pressures cause an internal force called as Thrust to generate and the gases move rapidly pushing the whole apparatus to the opposite dir

ప్రాణ దీపం விளக்கு வாழ்க்கை Vizhakku vāzhkkai

నా హృదయం లో వెలిగే ప్రాణం అనే దీపం నీవు నా ప్రతి పలుకు లో జాలువారే అసమాన అక్షరం నీవు  ఏమని సంబోధించను నిన్ను, నీకోసం  ప్రాకులాడాను  నేను నన్నే నేను మరిచిపోయా  నీలో లీనమయ్య భావానికి భాష తోడులా  వచనానికి అర్ధం తోడులా  సూర్యునికి నీడ తోడులా   మెరుపు కి పిడుగు తోడులా నీకు నేను ఎప్పటికి తోడులా ఉంటాను  ఏ నాటికైనా నీ కోసమని వేచి చూస్తూనే ఉంటాను விளக்கு வாழ்க்கை நீ, என் இதயத்தில் எரிகிறது சமச்சீரற்ற பாய்கிறது என் கடிதம் ஒவ்வொரு கூற்றின் நீங்கள் நீங்கள் கவனிக்கப்பட வேண்டும் என்ன, நான் பின்பற்றி உனக்காக மறந்துவிட்டேன் நீங்கள் என்னை மூழ்கியிருந்த மொழி கருத்து கூடுதலாக உரை பொருள் கூடுதலாக சூரிய நிழல் கூடுதலாக மின்னல் போல்ட் கூடுதலாக கூடுதலாக, நான் எப்போதும் உன்னுடன் இருப்பேன்   நான் பார்க்க காத்து ஒரு நாள் Vizhakku vāzhkkai nī, en itayattil erikiratu Camaccirarra pāykiratu en katitam ovvoru kūrrin nīnkazh Nīnkazh kavanikkappata vēntum enna, nān pinparri unakkāka Marantuvittēn nīnkazh ennai mūzhkiyirunta Mozhi karuttu kūtutazhāka Urai porul kūtutazhāka Cūri

వెతుకులాట

Image
ఇమేజ్ కర్టసీ: వాల్పేపర్ వొర్తెక్ష్ నిన్ను వెతుకుతూ ఓ దారి పట్టాను వింతగా అది ఎన్ని వంకర్లు తిరిగి ఉందొ !! అలసి ఇక్కడ నేను ఆగిపోతే దరి నీదు చేరేదెలా నా గోడు వెళ్ళగక్కేదెల?? పరిపరి విధాల యత్నిస్తూ సాగిస్తున్న ఈ పయనం లో ఎన్ని అడ్డంకులో !? మండే ఎండకు ఎండుతూ కురిసే వానలో తడుస్తూ ఎన్ని మైళ్ళు తిరిగానో ?!

జలతారు వెన్నెల

Image
చాన్నాళ తరువాత  నాకు నిన్ను చూడాలనిపించింది ఎందులోనో రాసుకున్న నీ చిరునామా కోసం వెతుకుతున్న తరుణమది ఎందుకో మనసు ఆపుకోలేక నీ కలవరింతల్లో మునిగిపోయింది ఏమీ తేల్చుకోలేక  సతమతమౌతు ఉంది ఇన్నాళ్ళు నీ ఎడబాటు లో కలకాలం మన స్నేహం ఇట్లానే ఉండాలని కోరుకున్న నేను కరిగి కనికరం చూపించే సమయాన అందరాని దూరాలకు వెడలిపోయావు ఇన్నేళ్ళ పిమ్మట మళ్ళి నువ్వు నాకు కనిపించావు మనసు లోలోనే మురిసిపోయింది ఈ వేకువ కోసమని ఎన్నేళ్ళు ఎదురు చూసానో గురుతే లేదాయే నీ ప్రేమ మాయలో చిరునవ్వుతో మొదలైన మన స్నేహం మాటల అలల్లో చిక్కి స్నేహపు చివరన ప్రేమ చిగురించి జలతారు వెన్నెల కురుస్తున్న సమయాన మల్లెల  మాలికల సాక్షిగా వీచే గాలి తడారిపోయింది చెదురు మదురుగా ఓ మోస్తరు ప్రేమను నాపై నటించి ఆపై వెడలి పోయావు ఇన్నేళ్ళు నే వేచి చూసింది ఇలాంటి ప్రేమకోసమా గుండె అలవాటుగా  కొట్టుకోవటం  మాని లయ తప్పింది, నా ఊపిరి లో నీ ప్రేమను నింపి యినేళ్ళు  బ్రతికించింది నా మనసు గాయపరిచావు అయిన  నాకు నీపైన మచ్చుకైన కోపం లేదు సుమీ ఉన్నతమైన ప్రేమ తప్ప నీ ఆ ప్రేమని నువ్వు సంద్రం లో ముంచేశావు, మబ్బులై వాన చినుకులై స్వాతి ముత్యమై మెరిసావు నిండ

Happy Friendship Day

Image
స్నేహం అంటే ప్రాణం లేని బంధం కాదు నీ నా మధ్య వెలిసిన అనురాగ వారధి నీ నా నడుమ నిలిచే కలకాల పెన్నిధి నీ నా మన వాత్సల్యాలకు పునాది కావాలి ఈ స్నేహం ఎన్నో తరాలకు నాంది స్నేహితుల రోజు పురస్కరించుకుని నేడు మన మధ్య మన తోడూ నీడగా నిలిచే ప్రతి స్నేహితుడు/స్నేహితురాలికి స్నేహితుల దినోత్సవ శుభాభినందనలు हमारे जिंदगी में पहले बार जब तुम मिले तो मन खिल उठा एक साथी जो हमे और हमारे सपने समझ पाए एक साथी जो हर समय हमारा साथ न छोड़े एक अनोखा स्नेह बंधन जो बंधा है हमारे बीच रहे ये बर्खारार  सालों साल बिना किसी हिचक के स्नेह दिनोत्सव के शुभ अवसर पर, अपने सारे दोस्त जिन्होंने अब तक और आगे भी अपनी उस अनोखा बंधन बाँध रखा है, उन सब को हार्दिक शुभकामनाएं Friends are those who help one in need Friends are those who try to be with you Friends are those who encourage you Friends are the positive energy of any society Friends are the strength and are supporters I wish all my dearest friends, A very happy friendship day, on the occasion of Friendship Day and Hope the friendship continues ev

ఏకాకి

Image
Image Courtesy: Worth1000.com ప్రేమించలేని మనసు ఇలానే ఉంటుంది అన్ని ఉన్న లేనట్టుగా అనిపిస్తుంటది వానలేని మేఘం ఇలానే ఉంటుంది, కారిపోయిన కన్నీటి చుక్కలా చినుకులు రాల్చుతూ కరుణలేని హృదయం ఇలానే  ఉంటుంది, మనసు లేని మనిషిలా జాబిలీ లేని రేయి ఇలానే ఉంటుంది, కాటుక కన్నుల్లో నల్లని రంగులా తంతిలేని వీణ పలుకనేల రాగాలు మీటిన రాలవు భావాలు రంద్రం లేని మురళిని ఎంత ఊదిన ఏమి లాభం, రాగం పలుకలేని వెదురు చెక్క మిగిలెను ఓ పక్క అన్ని ఉంటె సరిపోదు ఈ లోకాన మనిషనే వాడికి మిగితా జంతువులకి ఉన్న తేడల్లా ఒకటే మనిషి అర్ధం చేసుకుని మసులు కుంటాడు లేనిచో ఇలాటి పూర్తికాని లోకం లో ఏకాకిగా మిగిలిపోతాడు  

నిదురించే కన్నుల...

నిదురించే కన్నుల మాటున రగిలే ఆవేదనను చల్లర్చుతుంది  కమ్మటి కలా వింతలూ వినుత్నాలు కోసమేగే కనుబొమ్మల కదలికకు  పోస్తుంది ఓ హాయి అలా చీకటికి వేకువకి మధ్య నిచ్చెన వేసి జలతారు వెన్నెల దివిలో నీ ఊహాలోకం లో తెలిపోకలా పగలు వగలకు వన్నె చేకూరుస్తుంది అదిగో ఆ హరివిల్లు తళుకుబెళుకు తో ఇలా భావాన్ని మనసులో బంధించగలమా లేదు ఎన్నటికి అలా జరగదు సుమా ఏ కాలమైన తరిగిపోని భాష ప్రాబల్యత నేడు అయ్యెను చూడు ప్రాణాలత 

హరి ఓం నారాయణ

అది నైమిశారణ్యం. ఆ అరణ్యం లో సర్వకాల సర్వావస్థలందు సత్సంగం సాగుతూ ఉంటుంది. ఆ సత్సంగానికి సూతుడు నాయకుదు. అతడే వక్త. శౌనకాదులు శ్రొతలు. ఈ సత్సంగంలో అనేక దివ్యక్షేత్రాల ప్రసక్తి ,దెవాధిదెవతల లీలలు కథరుపంలో సూతుడు  శౌనకాదులకు విన్నవించటం పరిపాటి. ఒకనాడు శౌనకాదులు సూతుణ్ణి చూచి "షడ్గుణాడ్య ! నారాయణస్వరూపుడైన వేదవ్యాసుని సత్కృపతో సర్వస్వము తెలిసిన మహానుభావుడివి. త్రిమూర్తులలో హరి శ్రేష్ఠుడు కదా! ఆ హరికి అండ పిండ బ్రహ్మాండాది లోకాలలో ఏది ప్రియస్థలము? ఎక్కడ హరి స్వయంవక్తుడిగా ప్రకాశిస్తూన్నాడు? సామాన్య మానవులు కూడా దర్శించగల క్షేత్రం ఏది? మాకు తెలియజేయగలరు" అని ప్రార్థించారు. సూతుడు శౌనకాదుల ప్రశ్నను, ఆకాంక్షను మేళవించుకుని స్థిమితకాలము ధ్యానలోచనుడై సమాధిలో మునిగి తదనంతరము శౌనకాదులను చూచి విశదంగా వివరించగలను అని బదులిచ్చాడు.   ఒకప్పుడు సమస్తము లయమైపోయింది. మహావిష్ణువు వటపత్ర శయనుడైనాడు. కాలం గడచింది. శ్వేతవరాహరూపం ధరించి జలంలోనికి ప్రవేశించాడు. పాతాళంలో దాగిన రుక్మాక్షునితో సమరం సాగించి అతనిని సంహరించాడు. పాతాళం లో ప్రవేశించి కోరలతో 'భూమి'ని ఉద్ధరించాడు. అపుడు బ్రహ్మాది

అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను!

అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను! నీ మదిలో నిలిచినా భావాల కలయిక నేను!! అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను! నీ గుండె లయగతులలొ ప్రతిధ్వనించే రాగం నేను!! అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను! నీ స్పందన ప్రతిస్పందన లో కలిగే ఒరవడి నేను!! అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను! నీ జ్ఞాపకాలను ప్రతిబింబించే నిలువుటద్దము నేను!! అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను! అంచెలంచెలుగా ఎదిగే కోపాగ్నిని చల్లార్చే హిమపాతాన్ని నేను!! అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను! మాటలు నేర్చి నవసమాజానికి దారిచూపే బావుటాను నేను!!

ఘర్షణ-సంఘర్షణ

కన్నులకు  దాచడం తెలియదు ,  అందుకే కలల రూపం లో నిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది మనసుకు మాట్లాడడం రాదు, అందుకే మూగాభాషను తనకు దగ్గరైన వాళ్ళ మనసులో చేరవేస్తుంది హృదయానికి దేనికెలా స్పందించాలో తెలిదు, బాధ ఐన సంతోషమైన అతిగా కాని అల్పంగా కాని కొట్టుకుంటది కన్నుల్లో కలల కొలనులో ప్రతిబింబించే ప్రతి బింబం మనం ఇంతకూ మునుపు చూసినదే వెన్నెల గీతికలు మనం ఇంతకూ మునుపు విన్నవే ఐన ఎందులకో ప్రతి సారి ఏదో కొత్త రాగం పలికినట్టు మనసు ఎటు తెల్చకా సతమతమవుతుంది ఎటు వేళ్ళలో దారి తెలియక, తెలిసిన దారి ఐన మనసు ఒప్పక, మనసు ఒప్పిన ప్రాణం ఒప్పక ఇలా ఒక్కో అవయవం ఒక్కోసారి నిరాకరణ కు గురవుతూనే ఉన్నాయి, లోకం ఇలా సాగిపోతూనే ఉంది   

మనుసు గేయం

ఊహాలొకమున ఏమున్నది గడిచిన కాలే జ్ఞాపకాలు  తప్పా, ఎంతగా ఉబలాటపడినా గొరంత మార్చలేమూ, నిండు మనసు లొ ప్రేమపు చమురుతొ జనకొటీ హృదయాల్లొ ఆశాజ్యొతి వెలిగింపజూడూ,  నీ లొకం నీకే కొత్తగా అనిపించును ఆ చిత్తరూపులేని, చలించనీ మూగభావాలు ఎప్పటికీ మారవు, మార్పునకు నీవే నాంది పలుకు, ఎంతో నిష్టతొ తప్ప పొందలెని ఈ మానవ జన్మని సార్థకం చెసే మానవత్వం మిళితం సేయు, కరిగిపొయిన ఆ కలలే అలలా పారి, నిన్ను మరల తాకలెవు వ్యర్థ ప్రయాసా కంటినిండుగ కన్నిళ్ళతొ మనసునిండుగ బాధటొ జీవిస్తె జీవింపజాలదు, మనిషనేవాడి జన్మ మంచి చెయ్యడానికే అన్నా హితము తెలుసుకొనినా, ఆ పీడకలలు కల్లలయ్యీ, మనసు తెలిక పడి, ఉరకలేస్తు నవ్వుతుంది పెదాలపై వికసించె నవ్వు ఇక ఎప్పటికి చెరిగిపొదు 

ఓ రేతిరి సుక్క

ఎన్నెల్లో ఒదిగిపోయిన సక్కాని సుక్క నీ ఏనాకేనకే నేను రానా ఓ బుల్లి కన్నుల్లో కాటిక నా మనసు కోస్తాందే ఓ చెలి జాబిలీ కొమ్మ సేరి సరసాలాడానికి వస్త నంటి వే గాని పొద్దు పోయే దాంక రాలే ఏమైతదో అని ఒకటే దిగాలుగున్నది ఓలమ్మి సెరువు గట్టు కాడ నక్కి నీ కోసం ఎంతసేపని ఎదురు సుసేది ఈ  సక్కని సుక్కని సుడందే ఉండలేనని ఎరిగి రానని అలిగినావ ఎం సక్కని నీ పలుకులు ఇందాం అని పరుగు పరుగున వస్తే నీరు గార్చకే ఓమ్మి కూకున్న ఈడనే ఈ సెట్టు తాన ఘడియ రెండు ఘడియలు దాటినాయి ఓ రేతిరి సుక్క రాయే ఇటు పక్క ఈ కొత్త కవిత నా చిన్న ప్రయోగం. ఎలా ఉందొ మనవి సేయు ప్రార్థన

నా నీడ

నా నీడ నువ్వని  నిన్ను నేను అనుకున్న నన్ను వెంటాడే కలవని నిన్ను నిదురలోనే కలవరించా వెండి మబ్బు కరిగిపోయింది ముత్యపు చినుకులా నేను నిన్నే తలుచుకున్న ఇప్పటివరకు జీవితం ఇంతే కాదు ఇంకెంతో ఉందని అనిపిస్తుంది నీ తియ్యని ప్రేమ మాయలో ఏమి జరుగుతుందో తెలిసే వీలే లేదు అడుగు జాడే లేకుండా మనం నడిచిన ఆ ఒడ్డులో ఆ జ్ఞాపకాలన్నీ ఇవేళ ఇసుకలో రాతలై మిగిలిపోయాయి ఒంటరిగా అలల తాకిడి ఒరవడిలో...!!

అందనంత దూరం

 నువ్వు పరిచయమయ్యావు నా లోకమే మారింది నిన్ను తలచుకున్న ప్రతిసారి ఏదో తెలియని ఆనందం కలిగింది  ప్రేమో ఆకర్షణో తెలియని వయసు ఐన నా మనసుని కొల్లగొట్టింది  ఇన్నేళ్ళు ఐన నిన్ను మరవలేదంటే అది ఆకర్షణ ఎంత మాత్రం కాదంటుంది నా మనసు  ఏమో మరి నువ్వు ఉన్నప్పుడు నాకు ఎలాటి వెలితి కనపడలేదు  ఇప్పుడేమో నా ప్రతి పదం ముందు ఒక సారి వెనక ఒకసారి నిన్ను తలవక మానసోప్పదు ఇన్నేళ్ళ మన పరిచయం అన్ని రంగులు చూసింది  మన పరిచయాన్ని నేను ఉద రంగు తో పోలిస్తే  అది పండి గోరింటాకు నారింజల  మెరిసింది  తామర రేకులా నాజుకైనా నా ప్రేమ కలగలిపి ఎర్రగా పండింది  అంతలోనే అమావాస్య చీకటి అలుముకుంది  నా అందాల జాబిలీ నిన్ను నా నుండి దూరం చేసింది నువ్వేమో అక్కడ నేనేమో ఇక్కడ అందుకున్నంత దూరం లోనే అందనంత దూరం

నీ స్నేహం ఓ అపురూప వరం

స్నేహం నీదు తోడైనా మబ్బుల్లో చినుకునై భువిపై జాలువారుతా  స్నేహం నీదు తోడైనా కటిక చీకటిలో వెండి వెన్నెలనవుతా  స్నేహం నీదు తోడైనా కంటిపాపలో కమ్మని కలనై కొలువుదీరుతా    స్నేహం నీదు తోడైనా చిటారు కొమ్మపై వాలే వసంతమై పలకరిస్తా స్నేహం నీదు తోడైనా పసిపాపల మోముపై చెరగని చిరునవ్వునవుతా  స్నేహం నీదు తోడైనా రెక్కలు కట్టి నీ దరికి చేరుకునే చిరుగాలినవుతా

ఉప్పెన : అలలతీరం లో రేగిన అలజడి : కడలి కెరటం ౪

Image
వైజాగ్ బీచ్ కారిడార్ కర్టసీ: వికీపీడియా  "ఇంతకీ ఇప్పుడు మౌనాన్నె ఆశ్రయించారన్నావు, మరి ఐదేళ్లే కదా.. పుష్కర కాలం సంగతేంటి" "అక్కడికే వస్తున్నాను, అలా చూడండి ఇది లాసన్ బే బీచ్, ఎంత బావుందొ కదా.. అలా మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోకపోయిన, నేను మాత్రం తనని ఆరాధిస్తూనే ఉన్నా. తను నేను మళ్ళి ఒకే కాలేజీ లో చేరాము, కాని వేరు వేరు బ్రాంచ్ లు" "ఇకనేం ఐతే, కాలేజీ ఒకటే, బ్రాంచ్లు వేరు, కలుసుకోవడానికి కుదరలేదు వెర్రి చూపులు అంతే కదా " "అబ్బ తెలిసినట్టు ఎం చెప్పారు.. అదేమ లేదు, నేను చెప్పేది ఆలకించండి, ఆ తరువాత ఆన్సర్ ఇద్దు గాని, అలా ఆ ఐదేళ్ళలో ఎప్పుడు తనని గమనిస్తూనే ఉన్న.. నాకు తెలీకుండానే, తను నన్ను గమనిస్తూనే ఉండేది" "అది నీకెలా తెలుసు అనే సందేహం మాది" "మా కాలేజీ లో ఇంటర్నల్స్ ఎప్పుడు వాళ్ళ క్లాసు లో వెళ్లి రాయాల్సిందే, అలా అన్నమాట నాకు తెలిసింది " "ఇంతకీ అసలు విషయానికి రావోయి" "అక్కడికే వస్తున్నా .. ఓపిక పట్టండి, ఇది ఎండాడ బీచ్, దిన్ని ఆనుకుని ముందుకెళితే అక్కడ భీమ్లి బీచ్ వస్తుంది... అలా థర్డ్ ఇయర్ లో ఒకరోజు నే

ఉప్పెన : అలలతీరం లో రేగిన అలజడి : కడలి కెరటం ౩

Image
 సంద్రం నుండి వైజాగ్ సిటీ వ్యూ : కర్టసీ: వికీపీడియా  1971 వార్ మెమోరియల్ "విక్టరీ అట్ సీ ", బీచ్ రోడ్ , కర్టసీ: వికీపీడియా   రాధాకృష్ణ అట్ కోస్టల్ బాటరీ  "ఇంకా మొదలు పెట్టనే లేదు.. అప్పుడే సస్పెన్స్ ఆ..? ఇంతకీ ఇప్పుడు ఎం చెప్పబోతున్నావు" "అలా అడుగుతారెంటి నే చెప్పబోయేది ముమ్మాటికి జరిగినదే.. పదండి అలా ఈ తీరం వెంబడి నడుచుకుంటూ మాట్లాడుకుందాం" "అలా మా పదిహేనో ఏట, మొదలైన ఆ తొలివలపు మొదట నన్ను తాకింది, మెల్లిగా తనకు సోకింది, ఆ తరువాత ఇంట్లో తెలిసింది, కథ ముగిసింది" "ఏంటిది.. పుష్కర కాలం పట్టినట్టు దాఖలాలు ఏమి లేకుండా పూర్వం 'కట్టే కొట్టే తెచ్చే' లా ఒక్క ముక్క లో ముగించేసావ్, దీనికోసం కూర్చుంది చాలదనట్టు యారాడ నుండి ఈ ఫిషింగ్ హర్బౌర్ వరకు తీరం వెంబడి నడిపించావ్ ఏమైనా ఉందా ఇందులో అంత గొప్పగా చెప్పుకోవడానికి; ఈ కంపు భరించలేకున్నాం, త్వరగా నడు " "అలా తీసి పారేయొద్దు, ఇది చాల పెద్ద కత, అంత చెబితే మీరు వింటారో లేదోనని ఇలా మొదలు పెట్టాను." "హమ్మ.. ఓపిక నశించింది .. ఇక నడవడం మా వల్ల కాదు" "ఇక్కడ