Posts

Showing posts from July, 2013

మనుసు గేయం

ఊహాలొకమున ఏమున్నది గడిచిన కాలే జ్ఞాపకాలు  తప్పా, ఎంతగా ఉబలాటపడినా గొరంత మార్చలేమూ, నిండు మనసు లొ ప్రేమపు చమురుతొ జనకొటీ హృదయాల్లొ ఆశాజ్యొతి వెలిగింపజూడూ,  నీ లొకం నీకే కొత్తగా అనిపించును ఆ చిత్తరూపులేని, చలించనీ మూగభావాలు ఎప్పటికీ మారవు, మార్పునకు నీవే నాంది పలుకు, ఎంతో నిష్టతొ తప్ప పొందలెని ఈ మానవ జన్మని సార్థకం చెసే మానవత్వం మిళితం సేయు, కరిగిపొయిన ఆ కలలే అలలా పారి, నిన్ను మరల తాకలెవు వ్యర్థ ప్రయాసా కంటినిండుగ కన్నిళ్ళతొ మనసునిండుగ బాధటొ జీవిస్తె జీవింపజాలదు, మనిషనేవాడి జన్మ మంచి చెయ్యడానికే అన్నా హితము తెలుసుకొనినా, ఆ పీడకలలు కల్లలయ్యీ, మనసు తెలిక పడి, ఉరకలేస్తు నవ్వుతుంది పెదాలపై వికసించె నవ్వు ఇక ఎప్పటికి చెరిగిపొదు 

ఓ రేతిరి సుక్క

ఎన్నెల్లో ఒదిగిపోయిన సక్కాని సుక్క నీ ఏనాకేనకే నేను రానా ఓ బుల్లి కన్నుల్లో కాటిక నా మనసు కోస్తాందే ఓ చెలి జాబిలీ కొమ్మ సేరి సరసాలాడానికి వస్త నంటి వే గాని పొద్దు పోయే దాంక రాలే ఏమైతదో అని ఒకటే దిగాలుగున్నది ఓలమ్మి సెరువు గట్టు కాడ నక్కి నీ కోసం ఎంతసేపని ఎదురు సుసేది ఈ  సక్కని సుక్కని సుడందే ఉండలేనని ఎరిగి రానని అలిగినావ ఎం సక్కని నీ పలుకులు ఇందాం అని పరుగు పరుగున వస్తే నీరు గార్చకే ఓమ్మి కూకున్న ఈడనే ఈ సెట్టు తాన ఘడియ రెండు ఘడియలు దాటినాయి ఓ రేతిరి సుక్క రాయే ఇటు పక్క ఈ కొత్త కవిత నా చిన్న ప్రయోగం. ఎలా ఉందొ మనవి సేయు ప్రార్థన

నా నీడ

నా నీడ నువ్వని  నిన్ను నేను అనుకున్న నన్ను వెంటాడే కలవని నిన్ను నిదురలోనే కలవరించా వెండి మబ్బు కరిగిపోయింది ముత్యపు చినుకులా నేను నిన్నే తలుచుకున్న ఇప్పటివరకు జీవితం ఇంతే కాదు ఇంకెంతో ఉందని అనిపిస్తుంది నీ తియ్యని ప్రేమ మాయలో ఏమి జరుగుతుందో తెలిసే వీలే లేదు అడుగు జాడే లేకుండా మనం నడిచిన ఆ ఒడ్డులో ఆ జ్ఞాపకాలన్నీ ఇవేళ ఇసుకలో రాతలై మిగిలిపోయాయి ఒంటరిగా అలల తాకిడి ఒరవడిలో...!!

అందనంత దూరం

 నువ్వు పరిచయమయ్యావు నా లోకమే మారింది నిన్ను తలచుకున్న ప్రతిసారి ఏదో తెలియని ఆనందం కలిగింది  ప్రేమో ఆకర్షణో తెలియని వయసు ఐన నా మనసుని కొల్లగొట్టింది  ఇన్నేళ్ళు ఐన నిన్ను మరవలేదంటే అది ఆకర్షణ ఎంత మాత్రం కాదంటుంది నా మనసు  ఏమో మరి నువ్వు ఉన్నప్పుడు నాకు ఎలాటి వెలితి కనపడలేదు  ఇప్పుడేమో నా ప్రతి పదం ముందు ఒక సారి వెనక ఒకసారి నిన్ను తలవక మానసోప్పదు ఇన్నేళ్ళ మన పరిచయం అన్ని రంగులు చూసింది  మన పరిచయాన్ని నేను ఉద రంగు తో పోలిస్తే  అది పండి గోరింటాకు నారింజల  మెరిసింది  తామర రేకులా నాజుకైనా నా ప్రేమ కలగలిపి ఎర్రగా పండింది  అంతలోనే అమావాస్య చీకటి అలుముకుంది  నా అందాల జాబిలీ నిన్ను నా నుండి దూరం చేసింది నువ్వేమో అక్కడ నేనేమో ఇక్కడ అందుకున్నంత దూరం లోనే అందనంత దూరం

నీ స్నేహం ఓ అపురూప వరం

స్నేహం నీదు తోడైనా మబ్బుల్లో చినుకునై భువిపై జాలువారుతా  స్నేహం నీదు తోడైనా కటిక చీకటిలో వెండి వెన్నెలనవుతా  స్నేహం నీదు తోడైనా కంటిపాపలో కమ్మని కలనై కొలువుదీరుతా    స్నేహం నీదు తోడైనా చిటారు కొమ్మపై వాలే వసంతమై పలకరిస్తా స్నేహం నీదు తోడైనా పసిపాపల మోముపై చెరగని చిరునవ్వునవుతా  స్నేహం నీదు తోడైనా రెక్కలు కట్టి నీ దరికి చేరుకునే చిరుగాలినవుతా

ఉప్పెన : అలలతీరం లో రేగిన అలజడి : కడలి కెరటం ౪

Image
వైజాగ్ బీచ్ కారిడార్ కర్టసీ: వికీపీడియా  "ఇంతకీ ఇప్పుడు మౌనాన్నె ఆశ్రయించారన్నావు, మరి ఐదేళ్లే కదా.. పుష్కర కాలం సంగతేంటి" "అక్కడికే వస్తున్నాను, అలా చూడండి ఇది లాసన్ బే బీచ్, ఎంత బావుందొ కదా.. అలా మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోకపోయిన, నేను మాత్రం తనని ఆరాధిస్తూనే ఉన్నా. తను నేను మళ్ళి ఒకే కాలేజీ లో చేరాము, కాని వేరు వేరు బ్రాంచ్ లు" "ఇకనేం ఐతే, కాలేజీ ఒకటే, బ్రాంచ్లు వేరు, కలుసుకోవడానికి కుదరలేదు వెర్రి చూపులు అంతే కదా " "అబ్బ తెలిసినట్టు ఎం చెప్పారు.. అదేమ లేదు, నేను చెప్పేది ఆలకించండి, ఆ తరువాత ఆన్సర్ ఇద్దు గాని, అలా ఆ ఐదేళ్ళలో ఎప్పుడు తనని గమనిస్తూనే ఉన్న.. నాకు తెలీకుండానే, తను నన్ను గమనిస్తూనే ఉండేది" "అది నీకెలా తెలుసు అనే సందేహం మాది" "మా కాలేజీ లో ఇంటర్నల్స్ ఎప్పుడు వాళ్ళ క్లాసు లో వెళ్లి రాయాల్సిందే, అలా అన్నమాట నాకు తెలిసింది " "ఇంతకీ అసలు విషయానికి రావోయి" "అక్కడికే వస్తున్నా .. ఓపిక పట్టండి, ఇది ఎండాడ బీచ్, దిన్ని ఆనుకుని ముందుకెళితే అక్కడ భీమ్లి బీచ్ వస్తుంది... అలా థర్డ్ ఇయర్ లో ఒకరోజు నే...

ఉప్పెన : అలలతీరం లో రేగిన అలజడి : కడలి కెరటం ౩

Image
 సంద్రం నుండి వైజాగ్ సిటీ వ్యూ : కర్టసీ: వికీపీడియా  1971 వార్ మెమోరియల్ "విక్టరీ అట్ సీ ", బీచ్ రోడ్ , కర్టసీ: వికీపీడియా   రాధాకృష్ణ అట్ కోస్టల్ బాటరీ  "ఇంకా మొదలు పెట్టనే లేదు.. అప్పుడే సస్పెన్స్ ఆ..? ఇంతకీ ఇప్పుడు ఎం చెప్పబోతున్నావు" "అలా అడుగుతారెంటి నే చెప్పబోయేది ముమ్మాటికి జరిగినదే.. పదండి అలా ఈ తీరం వెంబడి నడుచుకుంటూ మాట్లాడుకుందాం" "అలా మా పదిహేనో ఏట, మొదలైన ఆ తొలివలపు మొదట నన్ను తాకింది, మెల్లిగా తనకు సోకింది, ఆ తరువాత ఇంట్లో తెలిసింది, కథ ముగిసింది" "ఏంటిది.. పుష్కర కాలం పట్టినట్టు దాఖలాలు ఏమి లేకుండా పూర్వం 'కట్టే కొట్టే తెచ్చే' లా ఒక్క ముక్క లో ముగించేసావ్, దీనికోసం కూర్చుంది చాలదనట్టు యారాడ నుండి ఈ ఫిషింగ్ హర్బౌర్ వరకు తీరం వెంబడి నడిపించావ్ ఏమైనా ఉందా ఇందులో అంత గొప్పగా చెప్పుకోవడానికి; ఈ కంపు భరించలేకున్నాం, త్వరగా నడు " "అలా తీసి పారేయొద్దు, ఇది చాల పెద్ద కత, అంత చెబితే మీరు వింటారో లేదోనని ఇలా మొదలు పెట్టాను." "హమ్మ.. ఓపిక నశించింది .. ఇక నడవడం మా వల్ల కాదు" "ఇక్కడ ...

ఉప్పెన : అలలతీరం లో రేగిన అలజడి : కడలి కెరటం ౨

Image
యారాడ బీచ్ ఇమేజ్ కర్టసీ: వికీపీడియా "సరె.. నువ్వు ఉప్పెన గురించి చెబుతావు బాగానే ఉంది.. కాని ఉప్పెన అంటే సంద్రమే కదా... మరి అందులో ఎం విశేషం ఉంది? హ్మ్.." "మీరు అనుకున్నట్టు నేను చెప్పే ఉప్పెన వేరు, మీరు అనుకుంటున్నా ఉప్పెన వేరు." " అదేమిటి విడ్డురం కాకపొతే, పైన అలా అలలతీరం అన్నావు గా మరి.. అంత కూడా తెలియదా..?" "భలే వారు మీరు, నాకు సంద్రం అంటే ఎందుకంత  ఇష్టం ఏర్పడిందో తెలుసా మీకూ ..?" "తెలియదు.. ఐన ఇదంతా మాకెందుకు చెబుతున్నావు... ఇందులో కొత్త ఏముందొ అది చెప్పు" "అక్కడికే వస్తున్నా.. ఆ సముద్రాన్ని ఎప్పుడైనా గమనించారా? తనలో ఎన్నో దాగుంటాయి, ముత్యాలు, చమురు, జీవరసాయనాలు, లవణాలు, ఇలా.. చెప్పుకుంటూ పొతే ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి" "అది  తెలుసు! అసలు విషయానికి రావయ్య .. నువ్వసల ఎం చెప్పదల్చుకున్నవో సెలవిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం " "అలా విసుక్కోకండి మరి.. నేను ఇప్పుడు చెప్పబోయేది నాకిదివరకు జరిగిన ఓ మరుపురాని సంగటన" "అదేవిటి ఇప్పటి వరకు సముద్రం అలా కెరటం అని మరి సంబంధం లేనివన్ని చెప్పి ఇప్...

ఉప్పెన : అలలతీరం లో రేగిన అలజడి : కడలి కెరటం ౧

Image
ఉప్పెన నిలకడలేని సంద్రానికి మరో పేరు అంతుచిక్కని ఆలోచనల ఆనవాళ్ళు ఎగసిపడే భావాల కడలి కెరటాలు "బీచ్ పార్క్"  బీచ్  అసలేముంది ఈ ఉప్పెన లో ..? ఉప్పే  నా..?? వేరే ఏదైనా ఉందా ..?? ఉదృతిలో పురోగమన తిరోగమన పౌనఃపౌన్యమ..? ఇన్నేళ్ళు ఐన వీడని ఈ చిక్కుముడి వేసినది ఎవరు..?? ఆ సాగర ఘోష ఎందుకంత ప్రాధాన్యత సంతరించుకుంది.. ??? With its turbidity and restlessness it sends out a message : Whatever you possess, or gain, you should always be humble, and ready to face challenges, ready to accept failures and success alike, overcome fears, be stable and stay calm. Now the Question is: What's this Uppena..? "Uppena" is a compass that puts one in a right direction, it's a beacon, that let's you know your boundaries in every stage of life. Moreover, it's a cute clean true love story. What is the relation in combining with the Sea and how is it relevant in this context? To know more, wait for a while... © 2000-2013 All rights reserved , "Uppena...

వర్ష కాలం

Image
Image Courtesy: Ralf Missal (Picasa) కదలి వచ్చింది చూడరో ఆకాశాన నిలిచినా మేఘమాల తనవెంట తెచ్చింది ముత్యాల హారం లాంటి చినుకుల మాల తనకు తోడుగా తెచ్చుకుంది ఆ మెరుపు ఖడ్గం ఉరుముతూ మెరుస్తూ చినుకులు ధారా పోస్తూ నీలి మేఘం పరవశం లో తడుస్తూ ఉంటె హాయిగా ఉన్నది ఈ కాలం బాధలో ఉన్న ఒడార్పునిచ్చే వరుణ గేయం ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన  ముత్యాల హారం మది పులకింతల్లో తుళ్ళి ఆడింది లోకాన్ని తనలో  లీనం చేసి వెళుతుంది అదిగో ఆ హాయి రాగం

కొన్ని తీపి నిజాలు

చినుకుల అందెలు తొడిగి తొలకరి నేడు నన్ను పలకరించింది ఇలా చల్లని గాలి ఏదో నా మనసుని ఓలలాడించింది నన్ను మైమరపించింది ఇలా ప్రతి చినుకు చిరుజల్లు ను చూస్తూ మనసు ఉప్పొంగింది నేడు నేల రాలే సుమాల దారిలో రంగురంగుల ఈ య'వనం' హాయిగా కనిపిస్తుంది నేడు కలతలు కలహాలు కల్మషాలు ఏమిలేని నవలోకం చూడాలి బోసినవ్వులు చిందించి చిన్ని పాపాయిలతో ఆడుకోవాలి

మరువలేని జ్ఞాపకం

కన్నులు పలికె భావాలు చిటికలొ అర్ధం చెసుకొవడం కష్టమే మనసులొనీ ఆంతరంగం జాడ తెలుసుకొవడం కష్టమే ఆ కన్నుల కొలనులొ మనసు ఆద్దం పై ప్రతిబింబమై వెలిగే నీ మోముని మరవడం చాల కష్టమే వెన్నెల ఆందాలు, చినుకు సరాలు, భావ తరంగాలు ఒకింత తెలుసుకొవడం కష్టమే ఇంత కన్నా వర్ణించాలంటే మాటలు రావటం కూడా కష్టమే నీ మోముపై చెరగని ఆ చిరునవ్వు నాకింకా ఇప్పటికి జ్ఞాపకమే నువ్వు పలికిన ఆ చిలక పలుకులు నాకింకా ఇప్పటికి జ్ఞాపకమే అలివేణి సరాల రాగ భావ తాళ సమ్మేళన భావాలు నాకింకా ఇప్పటికి జ్ఞాపకమే నన్నొదిలి నువ్వు ఉండలేనన్న బాస చేసుకున్న క్షణం నాకింకా ఇప్పటికి జ్ఞాపకమే నన్నొదిలి వెళ్ళిపోతున్న క్షణం నీ కనులనుండి రాలిన కన్నీటి బొట్లు నాకింకా ఇప్పటికి జ్ఞాపకమే నువ్వదిలి వెళ్ళిన ఆ జ్ఞాపకాలు ఇంకా నన్ను వీడిపోలేదు నువ్వు అల్లిన ఆ ప్రేమపు అల్లిక ఇంకా నన్ను వీడిపోలేదు నీకై వేచిన ఆ తియ్యని క్షణాలు ఇంకా నన్ను వీడిపోలేదు స్వచ్చమైన అనురాగం పాళ్ళు ఇంకా నన్ను విడిపోలేదు కరిగే కాల చక్రం లో ఆ రోజు ఇంకా నన్ను వీడిపోలేదు   

కావ్యం అంటే

Image
అక్షలారను భావం అనే కొలను లో దింపి మనసనే చేద తో వెలుపలికి లాగితే అదే కావ్యం అంటే మనసులోని అనంతమైన భావాలను ఎకరూపు పెట్టి ఒక మాల లా కడితే అదే కావ్యం అంటే కన్నులే చూసే లోకాన్ని అక్షరాలతో మనసుకు  కూడా చూపగలిగితే అదే కావ్యం అంటే ముసిరే భావాలు మెదిలే ఆలోచనల సరళి మానవత్వపు విలువలు కలగలిపితే అదే కావ్యం అంటే నా భావాన్ని ఇతలులతో పంచుకుంటే భాష బేధాలు ఏవి నన్ను ఆపలేవు నాలోని ఆలోచనల సౌరభమ్ ఈ అక్షర కూర్పు నవయుగపు సంచలనం భాషలు ఎన్ని ఉన్న అన్నిట్లో చెప్పే భావం ఒక్కటే దాన్ని లోకం లో ఏ శక్తి అడ్డుకోలేదు అది చెప్పడానికే మానస పుత్రికగా ఓ వెన్నెల కొమ్మల వెలుగుచూసింది నా కావ్యం నోట్: ఈ క్రింది లైన్ ను నా సొంత భాష లో వ్రాస్తున్నాను: అది చెప్పడానికే మానస పుత్రికగా ఓ వెన్నెల కొమ్మల వెలుగుచూసింది నా కావ్యం ఊ కెనజ్ మాతెమాతి హుయి చాందేర్  ధ్వాళోసప్ డ్వాళీని వజాళో దిటిచ మారో కవిత ఏ భాషైన భావం ఒక్కటే అని చెప్పడానికే ఇక్కడ నా మాతృభాష ప్రస్తావించడం జరిగింది. తీక్షణంగా గమనించాలని కావాలనే మొదటి పదం తచ్చు-అప్పు గా రాయడం జరిగింది.

మురళి రవం

వేణుగాన మురళి రవం ఆలకించాను నేను  మైమరపించే ఆ రాగం ఎచట నుండి వస్తుందో  నా మనసుని యిట్టె అలుముకుంది  వెదురులో గాలి విన్యాసాలు వీనులవిందు చేసి  మెల్లగా వెనుతిరిగింది, తన కమ్మని స్వరాన్ని నా మదిలో నాటి  వీణ నాదం వినగానే మది పులకించి పోయింది  తంతి మీటుతుంటే మదిలో భావం ఉరకలేసింది  ఒక్కో స్వరం అలా పలకిస్తూ ఉన్నా కుష్మాండ భాండం అది  నన్ను సంమోహితుని చేసి నాలోని తంతిని లాగింది శృతి చేస్తూ 

ఎదురు చూపులు

Image
నీలాల ఆకాశం వైపు చూసా, నవ్వుతున్న నీ బింబం కనిపించింది,  మబ్బుల్లో దాగుడు మూతలు ఆడుతూ బంగరు నేల వైపు చూసా, బీడుగా మారి బీటలువారి తడి ఆరిపోయి గోముగా చినుకును ఆహ్వానిస్తూ పక్కనే ఉన్న మోడుబారిన చెట్టును చూసా, కండ కరిగి ఎముకలే మిగిలిన అస్తిపంజరాన్ని తలపించింది ఆకులన్నీ రాలిపోయినా, చివురులు తొడిగే ఆశతో అది నిటారుగా వసంతం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆశలు ఆశయాల ముందు బాధలు కన్నీళ్ళు అన్ని చిన్నవిగా అనిపించాలి  జీవితం అంటే ఎగుడు దిగుడులు కష్ట సుఖాల మేలి కలయిక అని అడుగు ముందుకు వెయ్యాలి.  ప్రకృతి మనిషికి ఎప్పుడు మేలు చేస్తూనే ఉన్నది,  తనలో ఇమిడి ఉన్న అంశాలతో మనకు హితబోధ చేస్తూ ఉంటుంది 

ప్రేమంటే అంతే మరి:

ప్రేమంటే అంతే మరి: ఇప్పటివరకు ఎరుగని బంధాన్ని కొత్తగా పరిచయం చేస్తుంది ఎన్నడు చూడని ఓ కొత్త ప్రపంచం లో మనల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది కన్నుల మాటు  అలికిడిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఎక్కడ లేని నవలోకాన్ని కళ్ళముందు ఆవిష్కరిస్తుంది కొత్తగా ఉన్న ఇంతకూ మునుపు పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు చూసిన వసివాడని పూదోటలా మనసుని ఉప్పొంగిస్తుంది తనతో పాటు రెక్కలు కట్టి ఊహాలోకం లో విహరింపజేస్తుంది నలుగురికి మంచిని పంచి పెట్టాలని హితబోధ చేస్తుంది

కవ్వించే మనసుగల లలన

Image
నీతో అలా సంద్రం ఒడ్డున నడచిన ఆ క్షణాలకు నీ అల్లరి చేష్టలకు నీ ముద్దు ముద్దు మాటలకు నీ బుంగ మూతి మెలికలు తిరుగుతుంటే కలిగిన ఆతృతకు పులకించిపోయా మది నిండుగా నిన్నే నేను దాచుకున్న నీ జ్ఞాపకాలు రోజు నన్ను ఇలా తడుముతూనే ఉన్నాయి నాకోసమే నువ్వన్నట్టు నీకోసమే నేన్నన్నట్టు ఒకరికొకరం ఓ జట్టుల మేలిగాము ఎవరి కళ్ళు కుట్టాయో  ఎవరి ఈర్శ్య కు లోనయ్యమో నువ్వాదిక్కు  నేనిదిక్కు మధ్యన వచ్చి పడింది చిక్కు అలా మొదలై ఇలా అలలా వెనక్కి వెనక్కి వెనక్కి నిన్ను తలుచుకుని బాదపడని రోజంటూ లేదు ఏడ్చాను ఎందుకో వెక్కి వెక్కి కళ్ళల్లోని కలలు చెదిరి కలత నిదురే పడుతుంటది నువ్వు గుర్తుకు వస్తే

జీవితసత్యం

సూర్యుడు మండుతాడని అందరికి తెలుసు,అలా అని  సూర్యుణ్ణి  వెలివేయ్యలెం చంద్రుడిపై నల్లటి మచ్చలున్నాయని అందరికి తెలుసు, అలా అని చంద్రుణ్ణి వెలివేయ్యలెం మబ్బులు దుమ్ముధూళి అని అందరికి తెలుసు, అలా అని వృష్టిమేఘాన్ని వెలివేయ్యలెం వెలుగు వికటిస్తే మిగిలేది  చీకటి అని అందరికి తెలుసు, అలా అని చీకటిని వెలివేయ్యలెం మనతో పాటుగా ఎదిగే ప్రతి జీవి స్వేచ్చగా బ్రతకాలని కోరుకుంటాం మన చుట్టూ ఏమి జరుగుతున్నా పట్టనట్టు మరి ఎందుకుంటాం కలసికట్టుగా ఓ జట్టుగా ఒకే గూటి గువ్వలుగా బ్రతకమని హితవాక్యాలు ఇస్తూ ఉంటాం కాని చేతల్లో అది చూపించక వెనుదిరిగి వెళ్లి పోతూ ఉంటాం. చెప్పిన మాట చద్ది మూట అని ఎరిగినా  మనం పదేపదే చెప్పి తప్పు చేస్తూ ఉంటాం ఎందుకని డబ్బుకు విలువ ఇచ్చింది మనం అని ఎరిగినా మనం మనకే విలువలు లేవని చాటి చెప్పుకుంటాం ఎందుకని మనిషి ఆశజీవి అని ఆశలే  ఆశయాలకు నాంది అని ఎరిగినా మనం అత్యాశ కు ప్రాకులాడుతాం ఎందుకని మనిషి జీవితం శాశ్వతం కాదని  ఎరిగినా మనం ఆ ప్రాణాన్ని విలువగా చుసుకోము ఎందుకని కామక్రొధమదమొహలొభమాత్సర్యాలు అరిషడ్వర్గాలని అవి ఎక్కువ...

కుసుమపరిమళాలు

గాలినై ఉండి ఉంటె నిన్ను క్షణాల్లో చేరి ఉండేవాడినేమో,  కాని నీ ఉచ్చ్వాస నిశ్వాస లో ఓ ఘడియే నిలిచుండే వాడిని నిప్పునై  ఉండి ఉంటె చల్లని మంచువుల్లో హాయిగా నీకు వేడిమి పంచేవాడినేమో ,  కాని నిన్ను చూస్తూ చూస్తూ నీ ఎదుటే కాలి బూడిదై  మిగిలే వాడిని నీరునై ఉండి ఉంటె నీ దాహార్తిని  హరించే వాడినేమో, కాని బాధ కలిగి నీ కన్నిరునై రాలిపోయే వాడిని చెట్టునై ఉండి ఉంటే నా నీడలో నిన్ను సేదతీర్చేవాడినేమో, ఎడాపెడా అడవుల్ని నరికివేస్తె మూగగా రోదించే వాడిని అందుకే మనసున్న మనిషినై పుట్టాను, నీ బాధ పంచుకునే నేస్తాన్నై జనించాను నీ ప్రేమను పొందాలని ఆశగా ఎదురు చూసాను, ఎడబాటు నిన్ను నాకు దూరం చేసింది కానరాని దూరాలకు మనల్ని విడదీసింది నీ జ్ఞాపకాలు నా చెంతనే పథిలంగ ఎప్పటికి చెరిగిపోకుండా ఉన్నాయి కొన్ని ఈ కవితల్లో అక్షర కుసుమాలై పరిమళాన్ని వెదజల్లుతూ ఉన్నాయి ఆకాశం హద్దుగా ఆ మబ్బుల మాటు దాగిన సూర్యునిలా నా ప్రేమని ఎప్పుడు నీపై ప్రసరిస్తూనే ఉంటా నీ జ్ఞాపకాల చిరుజల్లుల్లో ఎప్పటికి తడుస్తూనే ఉంటా... నా భావాలను ఇలా పెరుస్తూనే ఉంటా 

जी भर न जाए

Image
Image Courtesy: Ralf Missal (Picasa) ओ सुनी सुनी सी सुर न जाने कहाँ से आ रही है सुन उसे मेरा मन ख़ुशी के मारे खिल उठा है जी करता है सुनता ही रहूँ उस सुनी अनसुनी सुर को जब तक जी भर न जाए मौसम ही कुछ ऐसा है मतवाला छा गया देखो मौसम रंगीला काले बादल घनघोर हुए अपनी छावनी में मंडराते हुए जी करता है देखता रहूँ इस प्रकृति के नए दौर जब तक जी भर न जाए अचानक सी एक नयी भावना जो मन में ऐसे जागी बुझने का कोई सवाल नहीं उठता कुछ ही क्षणों में ऐसी फैली जी करता है बुलाता रहूँ में तुमको जब तक जी भर न जाए 

నీకై నిరీక్షణ

Image
నే వేసిన ప్రతి అడుగు నీ వైపే కాని నీ జాడ ఎటు లేదు ఎంత దూరం వచ్చానో గురుతే లేదు ఓ సారి వెనక్కి తిరిగి చూద్దామన్న ధ్యాసే లేదు ఎంత దూరం లో ఉన్నవో ఊసే లేదు ఓ సారిలా కాలాన్ని ఇలా శీలల ఉండిపోని నే కన్నా కలలన్ని నాకు ఎదురవ్వని నా ఆలోచన రూపురేఖలు నువ్వే అవ్వని తిరిగి నిన్ను నేను నాలోనే చూసుకొని జోరు వర్షం వచ్చిన తడుస్తూనే ఉన్నాను మండే ఎండలోన నీకై వేచి ఉన్నాను రాతిరి జాబిలితో వెన్నెల కబురంపినాను తిరుగు టపా పంపుతావని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను నీ జ్ఞాపకం నా మది నిండా సాలెగుడు లా చుట్టుముట్టని నీ వాలు కనులలో ఓ చిరు స్వప్నమై నన్నుండిపోనీ నీ మాటల ప్రవాహం లో ఓ కన్నీటి బొట్టు నేనవని నీ యద లయలో నేను ఓ గుండె చప్పుడవ్వని Image Courtesy: Corey Rich (Picasa)

చూడలనున్నది

రెక్కలు కట్టి ఎగరాలనుంది మనసుకు సుదూర తీరాల వెంబడి గగన తలం తాకి రావాలనున్నది ఈ వింత ఆనందానికి అవధుల్లేకుండా అనంతాలకు వెళ్లి రావాలనున్నది తార తీరం లో ఆ చుక్కల తోడుగా పొద్దు పొడుపులో చల్లని మంచుబిందువుల్లో హాయిగా ఆడాలనున్నది కల్మషం లేని మనసుని నేడు వీణలా  మీటుతున్న నాదం ఏమిటో తెలుసుకోవలనున్నది కన్నుల మాటున సాగే కలల జాడలు వెతకాలనున్నది నీలి నింగిని వీడని మబ్బుల మాల లా ఎప్పటికి ఇలా నిన్ను నా యెదలో నిలపాలనున్నది జాబిలీ చుక్కల సాక్షిగా వెన్నెల కలువల సాక్షిగా మౌనన్ని వీడాలనుంది ఏదో తెలియని పరవశం తో మది ఊగిపోతుంటే నిలకడగా నిలవాలనున్నది నా ఎదుటే ఉన్న ప్రకృతి నేడు నా చెంతకు చిగురించే ఆమనిని  తన వెంట తిస్కోస్తుంటే చూడలనున్నది  

రాగాలాపన

రంగుల రాట్నం రివ్వున రువ్వింది రెప్పలమాటున రేయి చాటున రేతిరి నిండింది రాగాలాపన రంగుల హరివిల్లై విరిసింది ఎన్ని "రా"లైన  వత్సరాలైన  నీ రాకకై మేన రంగరించి తెచ్చానే గలగల ఏటి గోల లో గమ్మత్తుగా గజిబిజిగా గాల్లో తేలి గులాబి రేకు గుబాలిస్తుందే గాయం నా యదకు చేసి గాయబ్ ఐనావె ఎన్ని "గా"లైన పిల్లగాలిలా నిన్ను వెంబడిస్తూ ఉంటానే  లేత లావణ్య సల్లలిత లలన లాగి నా మనసుని లేలేతగా లాలించి లఘుస్నేహం చేస్తివే ఎన్ని "లా"లైన నీల ఎవ్వరిని లాలించలేదే పారే ప్రతి పిల్లవాగులో ప్రేమగా నిన్ను పిలిచానే పలకరించక పెలవగా పలికావే ఎన్ని "ప"లైన  విన్నపాలైన  పూచే ప్రతి పువ్వుతో పంపానే నన్ను నేనుగానే నిలవని నింగి నేల నిప్పుల నావలో నదిని నేడు అలవోకగా దాటని ఎన్ని "న"లైన   ఎన్ని నాళ్ళు ఐన నాలోని నేను నీకోసం నేను  

గుప్పెడంత కూడా లేని గుండె

గుప్పెడంత కూడా లేని గుండెలో ఇమిడి దాగున్న భావాల ప్రవాహం సంద్రం కన్నా లోతైనది నిట్టూర్పులు నిస్సహాయత కోరే మనసు లోని ఆలోచనలు అలా నింగి కన్నా ఎత్తైనది భారమే లేని అతి తేలికైన అక్షరాలే ఏర్చి కుర్చీ భావమై జనించే వేళా ఆ అక్షరానికి వెలకట్టలేనిది గుండె ఐన ఏదో నాటికి ఆగిపోతుంది , ఎగసే అల అమావాస్యకో పున్నమికో పురోగమన తిరోగమనం అవుతుంది మది లోని భావాలు కొన్ని సార్లు ఒకే ల ఉండవు, కవితపు అక్షరాలూ మాత్రం చూసే వారి మదిలో శిలక్షరాలై ఎన్నటికి నిలిచిపోతుంది జీవితం అనే కుంచె నుండి జాలువారే ప్రతి ఘట్టం ఓ రంగు అనుకుంటే , ఆ రంగుల కలయిక తో ఓ జీవన చిత్రం ప్రాణం పోసుకుంటూ ఎదురు పడుతుంది అక్షరాలూ చిన్నవే ఐన కవిత చిన్నదే ఐన భావం ఎంతో పెద్దది కలకాలం నిలిచి ఉంటది. 

Over the Hills and Valleys

Image
The Loco chugging over those Tracks Sends a wave of thrill and Happiness Which brings the Near and Dear Closer The hawker sounds cheerful and Clear With Green Lantern in his hands Guardman and Cabinman exchange Semaphores Ahead Comes the Station with lot passengers parting to their Destinations And lo the Bridge makes Rumbling Sounds With People inside, sitting as the heart Pounds Over the Hills and Valleys, The Tunnels and Quarries The Curves and Straights, The Bends and the Shunts It's really the lifeline transporting frieghts and Passengers Saluting to their Stride in making Railways the Important link in all Conditions Dedicated to INDIAN RAILWAYS Image Courtesy:  Arjun Singh WAP 4 22544 hauled Gomti Express from Lucknow rounds the curve near Indraprasta Thermal Power Station. Ashwin Rao WCAM3 hauled  Chchatrapati Shivaji Terminus Mumbai Bhusaval Passenger with up the Thull Ghats.

నీ ప్రేమలో ...

శ్రీకాకుళం లో మన ప్రేమకు శ్రీకారం చుట్టలనుకున్న విజయనగరం లో మన ప్రేమపు విజయ బావుటా ఎగుర వెయ్యలనుకున్న విశాఖపట్నం లో మన ప్రేమపు వైశాఖాన్ని చవి చూడాలనుకున్న తూర్పు గోదావరి ఒడ్డున నువ్వు పశ్చిమ గోదావరి ఒడ్డున నేను గోదారమ్మ ఉరకలై ఉందాం అన్నావు కృష్ణ మ్మా ఒరవడిలో ఒకరికొకరం సాక్షిగా ఉందాం అన్నావు రంగారెడ్డి నుండి హైదరాబాద్ దాక ప్రేమ పరుగులు పెట్టించావు గుంటూరు మిరపంత ఘాటు ప్రేమ మనది అంటూనే కన్నీళ్ళు తెప్పించావు నిర్మలమైన ప్రేమలో ప్రకాశి స్తామని పలికావు నెల్లూరు నడిబొడ్డున నెలవంకల నా ముందు నిలిచావు చిత్తూరు లో నిన్నెంత చిత్తుగా ప్రేమిస్తున్నానో అర్ధమయ్యింది చిగురించిన ప్రేమ కోవెల గ(క)డప దాటి లోనికి పరుగులు తీసింది అనంతమైన మన ప్రేమను ఆస్వాదించాలని  అనంతపూర్ పయనమయ్యింది నా మనసు కర్నూల్ కాకపొతే మహబూబ్నగర్ లో నైన నిన్ను నా దరికి పిలవలనుకున్న నల్గొండ లో నీకోసం నాలుగు రోజులు వేచి చూడాలనుకున్న మెదక్ లో నీ చేతికి మైదాకు (గోరింటాకు) పూయమన్నావు వరంగల్ లో నా మీద ప్రేమతో ఒరిగిపోయావు కరీంనగర్ , ఆదిలాబాద్ , ఖమ్మం చూసొద్దాం అని చెప్పిన నువ్వు అది మరి నిజమో అబద్దమ...

దాపరికాలు

జాబిలీ కాంతుల్లో నిన్ను నేను కనుగొన్నాను వెన్నెల మాటు చీకటిలో నిన్ను నేను కనుగొన్నాను ఉదయించే సూర్యుని బదులుగా నిదురలేపే రాగం లో నీ పిలుపు విన్నాను ఉదాయాస్త సంగమం లో అలల ఒడ్డున వీచే గాలిలో నువ్వే నన్ను తాకావు ఎ కాలమైన నిన్నే చూస్తున్న, ఎవరిని కలిసిన నిన్ను కలిసినంత ఏ రాగాలాపనలోన నీ స్వరమే పలుకుతున్నంత మైమరిచిపోయాన నీ ప్రేమలో నాకే తెలియకుండా ఆసాంతం నువ్వే నువ్వే అది దాపరికాలు కాకుండా 

मेरी दिलासा

Image
Image Courtesy: iStock Photo आ रही हो यादों में हमेशा मेरी दिल दुखा कर तुम यों चली वापस ले आना बहारा गुलशनों का पिक मयूर भंवर और मृग का अरमान नए उमंग नयी सितारों का खेल देख हमें दांग रह जाए अनोखा है यह मेल बरसों पहले अनजाने में हुयी एक हादसा आजा अब और रूखे कैसे मेरी दिलासा 

ప్రేమే ఔనేమో

Image
వర్షించె ప్రతి చినుకు బిందువు పుడమిపై మెఘం చూపించెది ప్రేమే  ఐతే, నాకు నీ మీద కలిగింది ప్రేమే ఔనేమో జ్వలించె ప్రతి సుర్యుని కిరణం ఇలపై భానుడి ప్రతాపం ప్రేమే ఐతే, నాకు నీ మీద కలిగింది ప్రేమే ఔనేమో జాబిల్లి కొసం వేచి ఉన్డి వికసించే కలువభామ మధ్య కలహం ప్రెమే ఐతే,నాకు నీ మీద కలిగింది ప్రేమే ఔనేమో నింగి అంచుల్ని తాకాలని కదలి చెసే ప్రయత్నం ప్రెమే ఐతే, నాకు నీ మీద కలిగింది ప్రేమే ఔనేమో విరబూసే పువ్వులు ఆమనిని పిలిచె ప్రయత్నం ప్రేమే ఐతే, నాకు నీ మీద కలిగింది ప్రెమే ఔనేమో

ప్రకృతి అందాలు

Image
Image Courtesy: Ralf Missal (Picasa) ఇసుక  రేణువులు  ముళ్ళ  పొదలు  మరుద్యానములు  వడగాల్పులు , మంచు తూఫాను  వడగళ్ళు  మంచుకొండలు  హిమశంఖాలు శృంఖలాలు వర్షపు ఈదురు గాలులు చివురించే ఆకులపై ముత్యపు చినుకు ప్రతిబింబాలు దట్టమైన పొదలు విశాల వృక్షాలు , రంగురంగుల పువ్వులు , పారే పిల్ల వాగులు ఏరులు సెలయేళ్ళు నదులు జలపాతాలు నిప్పు కణికెలు కుంపటి సెలయేళ్ళు దట్టమైన పొగలు రాళ్ళూ రప్పలు ప్రకృతి కుంచె నుండి జాలువారిన  రంగు రంగుల హరివిల్లు ఇంతటి వైవిధ్యం ఉన్న కలసికట్టుగానే మెలిగే ప్రకృతి సోయగాలు కాని మనిషికి మనిషికి మనసుకు మనసుకు ఎందుకీ ఆర్భాటాలు అన్నిటిని ఎరిగిన ఒకరిని ఒకరు అర్ధం చేసుకోలేని వ్యత్యాసాలు కలసి కట్టుగానే ఉండాలని ప్రకృతి పాఠం నేర్పిన నేర్వని వైనాలు

ଜଗନ୍ନାଥ ରଥଯାତ୍ରା

Image
  ପୁରୀ  ଜଗନ୍ନାଥ ରଥଯାତ୍ରା

ఎందుకనో

Image
Image Courtesy : Ralf Missal  (Picasa ) రాతి గుండెనైన కరిగించి ప్రేమామృతం కురిపించే కన్నుల్లో కన్నీటి ధారలు ఉప్పొంగెను ఎందుకనో  వెన్నెల అందాలు చూడాలంటే రేయిని ఆశ్రయించాలి ఎందుకనో సూర్య రాష్మికి కడగల్లు వడగల్లై కురియును ఎందుకనో  చిమ్మ చీకట్లు తరిమేసే భాను కిరణాలకు గ్రహణం ఎందుకనో  ధవళ కాంతులీనే జాబిల్లి వెన్నెల చంద్రునికి ఆ నల్లని మచ్చలు ఎందుకనో  మబ్బుల మాటున చల్లని గాలి తుంపర్లు మంచు బిందువులై రాలేను ఎందుకనో 

విలువలు

కంటిపపకు  కన్నీటి  విలువ తెలుసు కనుకనే మనసు వికలం అయితేనే కన్నీళ్లు కారుస్తుంది  హృదయానికి ప్రేమ విలువ తెలుసు కనుకనే ప్రేమించే మనిషి దూరం ఐతే లయ తప్పుతుంది స్నేహానికి మనిషి విలువ తెలుసు కనుకనే ఆదరించే వాళ్ళు దూరం ఐతే విలవిలాడిపోతుంది 

సంబంధాలు

Image
కాస్త తీరిక దొరికినపుడు సరేలే అని న్యూస్పేపర్ తిప్పి చూస్తె ఏముంది చెప్పుకోవడానికి అన్నట్టు రాజకీయాల మాటున చదరంగపు పావులు.. సన్నగిల్లుతున్న సంబంధాల పెడబొబ్బలు, మనిషి ప్రాణానికి ప్రాణం అయ్యి కూర్చున్న డబ్బు ఉత్థాన పతనాల కథ కమామిషు. ఇంతకూ మునుపు సంబంధికుల మధ్య సంబంధం ఎలా ఉండేదంటే ఒకరినొకరు ఎలా అర్ధం చేసుకునే వారంటే పెళ్లి ఐన పేరంటం ఐన అసలు వాళ్ళకంటే వీళ్ళ హడావిడి ఎక్కువగా ఉండేది. అన్న తమ్ముళ్ళ మధ్య అనుబంధాలు అన్న చెల్లెలా మధ్య వాత్సల్యాలు ఇలా ఎటు చూసిన ఆప్యాయతల నడుమ సాగే భాంధవ్యం గోచరిస్తూ ఉండేది. మొన్నీమధ్య మా వూరేల్లినపుడు మా మామ్మ ఒక్క విషయం చెప్పింది అది నా మనసులో ఎంత లోతుగా పాతుకు పోయిందో  మాటల్లో చెప్పలెను. ఈ మధ్యకాలం లో అమ్మ నాన్న లను  చులకన చేసి, వాళ్ళకు నచ్చింది చెయ్యకుండా , అమ్మ నాన్నలను బాధ పెడుతూ ఉన్న సంగతులు ఎక్కడో అక్కడ మనకి వార్తల్లో వస్తూనే వుంటాయి. ఆవిడ ఎం చెప్పారంటే .. " మనం ఎక్కడికైనా వెళ్ళితే ఎవరో...

చిన్ని కవిత

 నిన్నటిదాకా  నిన్ను  నేను  వలచ  నీ  మధురమైన  జ్ఞాపకాలను  తలిచ  మనసాగాలేక  నిన్నోకసారి  పిలిచా  నా  హృదయాన్ని  ప్రేమ మందిరంల మలిచ  నీ తలపులలో  నన్నే నేను మరిచ ఆకాశ వీధుల్లో పక్షిని విహరించ 

Doctor's Day Special

Image
Doctors are the life-savers and are really the god-like people, who work for the well-being of all equally. On this Doctor's Day, I would like to wish all Doctor Fraternity and all the Surgeons who have put all their effort in making the world pain-free and suffering-free. Doctors need not to be very much serious in their profession; a doctor has to be friendly with every patient whom he/she attends and should make the patient , even who is suffering from a life-threatening disease, believe that he will live on and, should impart a kind of motivation that the patient can live with a smile on his face. I respect Doctors, and coming to the point, I am the person, who visits a doctor rarely; the last time I visited a doctor for consultation is somewhere in 2011. But even then Doctors are live saving army men. They are god-like amongst people. Here I quote the Dhanvantari Mantra: "शरीरे जर्जरीभूते व्यIधिग्रस्ते कलेबरे. औषधं जाह्नवीतोयं वैद्यो नराय्णो हरिः." When a...