సంబంధాలు

కాస్త తీరిక దొరికినపుడు సరేలే అని న్యూస్పేపర్ తిప్పి చూస్తె ఏముంది చెప్పుకోవడానికి అన్నట్టు రాజకీయాల మాటున చదరంగపు పావులు.. సన్నగిల్లుతున్న సంబంధాల పెడబొబ్బలు, మనిషి ప్రాణానికి ప్రాణం అయ్యి కూర్చున్న డబ్బు ఉత్థాన పతనాల కథ కమామిషు.

ఇంతకూ మునుపు సంబంధికుల మధ్య సంబంధం ఎలా ఉండేదంటే ఒకరినొకరు ఎలా అర్ధం చేసుకునే వారంటే పెళ్లి ఐన పేరంటం ఐన అసలు వాళ్ళకంటే వీళ్ళ హడావిడి ఎక్కువగా ఉండేది. అన్న తమ్ముళ్ళ మధ్య అనుబంధాలు అన్న చెల్లెలా మధ్య వాత్సల్యాలు ఇలా ఎటు చూసిన ఆప్యాయతల నడుమ సాగే భాంధవ్యం గోచరిస్తూ ఉండేది.

మొన్నీమధ్య మా వూరేల్లినపుడు మా మామ్మ ఒక్క విషయం చెప్పింది అది నా మనసులో ఎంత లోతుగా పాతుకు పోయిందో  మాటల్లో చెప్పలెను. ఈ మధ్యకాలం లో అమ్మ నాన్న లను  చులకన చేసి, వాళ్ళకు నచ్చింది చెయ్యకుండా , అమ్మ నాన్నలను బాధ పెడుతూ ఉన్న సంగతులు ఎక్కడో అక్కడ మనకి వార్తల్లో వస్తూనే వుంటాయి. ఆవిడ ఎం చెప్పారంటే .. " మనం ఎక్కడికైనా వెళ్ళితే ఎవరో ఒకరు మన కంట పడుతారు , వాళ్ళని పరిచయం చేసుకునే క్రమం లో పేరు గోత్రం అడగటం పరిపాటి అల అడిగినపుడు మన గోత్రం వాడైతే  అన్నయ్య అనో మన కన్నా వయసు లో పెద్ద ఉంటె బాబాయి అనో పెదనాన్న వరస అని కలుపుకొని మాటలు కలుపుతాం , కాని అల ఎవరో ఆగంతకుడిని పట్టి నాన్న అనో అమ్మ అనో అనలేము. ఎందుకంటే మన మనసాక్షి దానికి ఒప్పుకోదు , ఎదుటి వాడి అహం కూడా దెబ్బ తింటది. ఇలా అంటున్నారంటే ఏదో ఆశించే అంటున్నరనుకునే కాలం ఇది. అందుకే అమ్మ నాన్నలతో మంచిగా మెదిలితే అంత కంటే ఇంకా మనకు కావాల్సింది ఏమిలేదు" అని విశదీకరించారు.

ఔను .. నేడు మనం చూస్తున్న బంధాలను ఓ వందేళ్ళు వెనక ఉన్న బంధాలను పోల్చుకుంటే , ఇప్పటి మొబైల్ ఫోన్స్ గుర్తుకొస్తాయి. ఇంతకూ ముందు ఫోన్ లో మాట్లాడాలంటే ఓ ఇన్డోర్ యూనిట్, ఓ కనెక్షన్ వైర్ అది కావాల్సి వచ్చెది. ఆ వైర్ లేకపోతె ఇన్స్ట్రుమెంట్ ఉన్న లాభం లేదు, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ మాట్లాడాలంటే అన్ని కనెక్ట్ చేసి ఉంటేనే అయ్యేది. ఇప్పుడు కాలం మారింది వైర్లెస్ సెట్స్ వచ్చి క్షణాల్లో ఎంత దూరమైనా మాట్లాడుకోవడానికి వీలునిచ్చింది. కాని దీనిని వ్యతిరేకంగా ఇదే వ్యూహాన్ని మానవ సంబంధాలతో పోల్చుకుంటే , ఈ వైర్లెస్ కాలం లో కూడా మనం కన్నేక్టేడ్ గ ఉండాలంటే మన మధ్య ఉన్నబంధం  అనే తాడు/వైర్ చాల పటిష్టంగా ఉండాలి, అంటే ఒకరి మధ్య ఒకరికి మన వాళ్ళేనన్న భావన ఉండాలి. మనిషికి మనిషికి ఎలాటి వ్యత్యాసం లేకపోతె గొడవలు పడడానికి ఏమి ఉండదు , వయోభారం మీద పడుతుంటే దిగాలుగా ఆకాశం వైపు చూస్తూ కన్నీళ్ళు కార్చి మౌనన్ని ఆశ్రయించే కురు వృధులకు అలాటి రోజులు చూడకుండా హాయిగా   మనవాళ్ళతో ఆడుకొని నవ్వుతు కనుమూసే రోజులు మళ్ళి తిరిగిరావాలని ఆశిస్తున్నాను .

కొన్ని చోట్ల ఒకే తల్లి కడుపునా పుట్టిన అన్నదమ్ముల మధ్య గొడవలు పడి  విడిపోతుంటే, ఆ తలిదండ్రుల బాధలు వర్ణనాతీతం . కలసి మెలసి ఐక్యతగా ఒక్కతాటి పై నిలిచే రోజులు రావాలి. ఈ భూప్రపంచం లో ఒకే ఒక జాతి ఉండాలి అదే మానవ జాతి. మనం ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి. ఏదేమైనా తలిదండ్రులు చూపించే వాత్సల్యం ఆ జన్మకి ఇంకా ఎవ్వరు అంతగా ఇవ్వలెరు. మనం పిన్ని బాబాయి అని అంటాం, అల అని వాళ్ళకు మన కంటే వాళ్ళ పిల్లలతో అమ్మ-నాన్న అని పిలిపించుకోవడమే వాళ్లకి ముఖ్యం, అందులో ఎనలేని సంతోషం దాగుంది. మనమంతా ఐక్యంగా ఉంటె మనల్ని విడగోట్టాలన్న ఆలోచన ఏ  ఒక్క బుర్రకి తట్టదు. మనకలాంటి ఆలోచనలేనప్పుడు ఓ చిన్న ఇసుక రేణువు కూడా కంట్లో నలకై బాద పెడుతూ ఉంటుంది.






పశు పక్షులు వేరు మనషులం  వేరు అని తెలియడానికే దేవుడు మనకి ఓ ఉనికిని ఇచ్చాడనుకోవడం  పొరపాటే, ఎందుకంటే పశు పక్షాదులు మన ప్రేమ ను అర్ధం చేసుకుంటాయి, కాని మనలా మేలగాలేవు. దీనికి ఉదాహరణగా : మేము ఏడాది నుండి గోరింకల్ని స్వేచ్చగా మా ఇంటి ఆవరణ లో సాకుతున్నాం (పేర్లు:బంగారు,బంగారి). తెలుగు వారికే అర్ధం కాని మా భాషా ని అవి చక్కగా అర్ధం చేసుకున్నాయి. ఎప్పుడు ఆకలేస్తే కీచ్ కీచ్ మంటూ కూని రాగాలాపన చేస్తూ కొబ్బరాకు మీదనో కిటికీ మీదనో వచ్చి వాలిపోతాయి . వాటికోసం  తెచ్చిన బూంది లను తిని నీళ్ళు తాగి సంతోషంగా ఎగిరిపోతాయి. వాటిని మాకు దగ్గర చేసింది వాళ్ళని కట్టడి చేసింది ఎ ఇనుప పంజరం కాదు మా లోని మానవీయ గుణం, అది అందరిలోనూ పుట్టుకనుండి ఉండేదే, కాకపొతే స్వార్థం అహం ఎక్కువ పాళ్ళు ఐపోయి ఇది లేనట్టు భావిస్తున్నాం అంతే . అలానే ఎవ్వరికి చిక్కని ఉడుత కూడా మా చేతి నుండి వేరుసేనగలు తీస్కుని తింటు వుంది అంటే నమ్మశక్యం కాని విషయం అందరికి. కాని ఇది ముమ్మాటికి నిజం. నాకైతే అనిపిస్తుంది అప్పుడు మనిషి రూపం లో ఉన్న రామునికి సాయం  చేసినందుకు మళ్ళి ఇన్నాళ్ళకు ఓ మనిషిగా పుట్టి ఆ చేసిన సాయానికి ఋణం తీర్చుకున్నంతగా సంబర పడిపోతాను. ఈ విషయాలు మీకిక్కడ ఎందుకు ప్రస్తావించానంటే ఏ సంబంధం లేని మన పలుకులు రాని మూగజీవులు సైతం మన ఆలోచనలకు అనుగుణంగా మేలుగుతున్నయంటే, మనిషి తనకున్న అహం స్వార్థం కోసం తన వాళ్లనే దూరం చేసుకుని చివరికి అందరు ఉన్న ఏకాకి లా మిగిలిపోతున్నాడు. ఇది ఎంత వరకు సబ్బబో ఒక్కసారి మిమల్ని మీరే ఆపాదించుకుని ఆలోచించండి. నేను చెప్పింది ముమ్మాటికి నిజం అని మీరే అంటారు, అనకున్న మీ మనసాక్షి ఐన అనుకుంటుంది. మనం ఎదుటి వారి సంతోషాన్ని కోరుకుంటే వాళ్ళ ఆనందం లో మనకు ఆశీర్వాదాలు పెరిగి పోతాయి.

ఇంతక్రితం మనషుల మధ్య సంబంధాలు బలంగా ఉండడం చేతనో మరి ఏమో .. అప్పటి కాలం లో ముసలివాళ్ళు దాదాపుగా వంద ఏళ్ళు బ్రతికేవారు . (మా అమ్మమ్మ వాళ్ళ అత్త గారు పోయేప్పుడు వయసు 103 సం ॥ ,  పక్షవాతం వచ్చిన కోలుకున్నారు, కంటి చూపు ఎంత తీక్షణంగా ఉండేదంటే కళ్ళద్దాలు కూడా పెట్టుకోలేదు తను ఇంట్లోనే ఉంది రోడ్ పై వెళ్తున్న వారిని కేకేసేది), అలాంటిది ఓ ఎద్దు కుమ్మడం తో మంచాన పడి దిగులు తో కనుముశారు , (తలుచుకుంటే నాకే కన్నీళ్ళు వస్తున్నాయి), కాని ఇప్పుడు గుండెపోటు, మధుమేహం, రక్తపోటు అని జబ్బులు కొనితెచ్చుకుంటున్న వారి సంఖ్యా అనూహ్యంగా పెరిగి పోయింది, వాళ్ళలో ఎ వక్కరిని కదిల్చిన చెప్పేది ఒక్కటే మమల్ని సరిగ్గా చూసుకునే వాళ్ళు కరువయ్యరానో , లేక నమ్మి మోసగింప బడిన వాళ్ళో ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఆ వయసులో కావాల్సింది "నా" అనే వాళ్ళ ఆప్యాయత, భరోసా.  ఒక్క సారి ఆలోచించండి మనం వెళ్తుంది మంచి దారిలోనేన , లేక అలవాటులు మార్చుకుని ముళ్ళబాట మిగిల్చిన  గాయాలనుండి ఉబికి వస్తున్నా రక్తాన్ని చూడకుండా మన దారిని మార్చుకోలేని చేతకానితనాన్ని పెంచి పోసిస్తున్నందుకా ?

(రోజు రోజుకి  సన్నగిల్లుతున్న మానవ సంబంధాల దృష్ట్యా నా మదిలో మెదిలిన భావాలను ఇక్కడ ప్రస్తావించా. ఎవ్వరిని కించ పరచాలని లేక చిన్న బుచ్చాలని చేసిన ప్రయత్నం కాదిది దయచేసి గమనించ గలరు)

గమనిక : నాకు చెప్పాలని తోచింది చెప్పను ఇందులో అచ్చుతప్పులున్న లేదా ఎవ్వరిని గాయపరిచినట్టు నా వ్యాఖ్యలు ఉన్న క్షమించ మనవి. ఇవి నన్ను కలచి వేస్తున్న ఆలోచనల నుండి పుట్టుకొచ్చిన ఓ చిన్ని ప్రయత్నమ్.
Disclaimer: The Views Expressed here, does not point out at any person living or dead, these are just my musings. [The Peetanayanas alias Mynahs Photos are real, and they are given utmost freedom, at our home. They are neither chained nor caged. They arrive at the window everyday, on their own, and we offer Boondi and Water, and Groundnuts for "Lullu Scrat" the squirrel. No Birds or Animals are harmed.(For PETA Purpose Only)]

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం